ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

21 September 2026

సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా  ఉన్నత స్థాయికి చేరడం సామాన్యమైన విషయం కాదు. సరిగ్గా ఇదే బాటలో పయనించి ప్రస్తుతం సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ కయాదు లోహర్. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' లో సుబ్బలక్ష్మిగా కనిపించనున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాల్లోకి రాకముందు ఆమె పడ్డ కష్టాలు, సవాళ్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసోం మూలాలున్న కయాదు పూణేలో చదువుకున్నారు.

ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి రావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే కుటుంబానికి ఆసరాగా నిలిచారు.

జీవనోపాధి కోసం మొదట్లో కాఫీ షాప్‌లో (స్టార్‌బక్స్) పనిచేయడంతో పాటు, బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా నెలకు కొంత వేతనానికి పనిచేశారు.

ఆ తర్వాత ఐటీ రంగానికి వెళ్లినప్పటికీ కార్పొరేట్ ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చేశారు. 2019లో 'టైమ్స్ ఫ్రెష్ ఫేస్' టైటిల్ గెలుచుకుని మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. 

2021లో కన్నడ చిత్రం 'ముగిల్‌పేటే'తో సినీ రంగానికి పరిచయమయ్యారు. తెలుగులో శ్రీవిష్ణు సరసన 'అల్లూరి' (2022)తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆశించిన విజయం దక్కలేదు. 

ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన తమిళ చిత్రం 'డ్రాగన్' సూపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యారు.