AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

Phani CH
|

Updated on: Sep 20, 2026 | 6:30 PM

Share

దేశీయ ప్రయాణికులకు ఇండిగో అదనపు ఛార్జీలను సవరించింది. రెండేళ్లలోపు శిశువుల ప్రయాణ రుసుము రూ.2,000 నుంచి రూ.3,000కు పెరిగింది. అదనపు లగేజీకి కిలోకు రూ.800, ఒంటరిగా ప్రయాణించే చిన్నారుల సర్వీస్‌కు రూ.5,999గా ఛార్జీలు మారాయి. ప్రయారిటీ సేవలు, ట్రావెల్‌ సర్టిఫికెట్‌ ఫీజులు కూడా పెరిగాయి. బేసిక్‌ టికెట్‌ ధర మారకపోయినా, ఈ యాడ్‌ఆన్‌ సేవలు అవసరమైన ప్రయాణికుల మొత్తం ఖర్చు పెరగనుంది.

ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ దేశీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. బేసిక్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోయినప్పటికీ.. శిశువుల ప్రయాణం, అదనపు లగేజీ, ప్రయారిటీ సేవలకు సంబంధించి పలు అదనపు ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై మొత్తం ప్రయాణ ఖర్చు భారీగా పెరగనుంది. కొత్త నిబంధనల ప్రకారం, పెద్దలతో ప్రయాణించే రెండేళ్లలోపు శిశువుల రుసుమును రూ.2,000 నుంచి రూ.3,000కి పెంచారు. శిశువులకు ప్రత్యేక సీటు కేటాయించకపోయినా ఈ రుసుము చెల్లించాల్సిందే. ఇక అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే.. ప్రతి అదనపు కిలోకు ఇకపై రూ.800 చెల్లించాలి. వీటితో పాటు, ఒంటరిగా ప్రయాణించే చిన్నారులకు ఇచ్చే ‘అన్‌అకంపనీడ్ మైనర్’ సర్వీస్ ఛార్జీని రూ.5,000 నుంచి రూ.5,999కి పెంచారు. వేగంగా చెక్-ఇన్, బోర్డింగ్ అయ్యే ప్రయారిటీ సేవల రుసుము రూ.450 నుంచి రూ.650కి, ట్రావెల్ సర్టిఫికెట్ ఫీజు రూ.200 నుంచి రూ.300కి పెరిగింది. ఈ పెరిగిన ఛార్జీలన్నీ తక్షణమే దేశీయ సర్వీసులకు వర్తిస్తాయని సంస్థ ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే

Tirumala: తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్యాస్ సబ్సిడీ కోసం నో వెయిటింగ్!

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

Follow Us