AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ 28 రోజుల్లోనే.. అంత తొందరెందుకు బాసూ..?

మరీ 28 రోజుల్లోనే.. అంత తొందరెందుకు బాసూ..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 20, 2026 | 6:43 PM

Share

రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించిన సినిమాలు కూడా నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వస్తుండటంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కనీసం ఆరు వారాల థియేట్రికల్‌ విండో ఇవ్వలేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో 8 వారాల నిబంధన అమల్లో ఉండగా, టాలీవుడ్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమీకరణం కారణంగా పరిస్థితి భిన్నంగా ఉందనే వాదన ఉంది. ఓటీటీ ఆఫర్లు, పైరసీ భయం కూడా నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

300 కోట్ల సినిమాకు కూడా 30 రోజులే థియెట్రికల్ రన్ చాలా..? నాలుగు వారాల్లోనే ఓటిటిలో ఇచ్చేయాలా..? డిజాస్టర్ సినిమాలను మూడు నాలుగు వారాలకు డిజిటల్‌కు ఇస్తున్నారంటే ఓకే కానీ బ్లాక్‌బస్టర్స్‌ను కూడా నాలుగు వారాలకే ఓటిటిలో దించేయాలా..? మరీ 8 వారాలు కాకపోయినా.. మరో రెండు వారాలు పెంచి 6 వారాలకు కూడా నిర్మాతలు ఓటిటి టైమ్ ఫిక్స్ చేయలేరా..? అసలేంటి పరిస్థితి..? బాలీవుడ్‌లో హిట్టు ఫ్లాపులతో పని లేకుండా ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది.. అలా కాదంటే మల్టీప్లెక్స్ వాళ్లు స్క్రీన్స్ ఇవ్వరు. అందుకే 8 వారాల రూల్‌ అప్లై అవుతుంది. టాలీవుడ్‌కి వచ్చేసరికి సీన్ రివర్స్.. ఇక్కడ నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కావడంతో 8 వీక్ విండో కుదరట్లేదు. అందుకే ఇరుముడి లాంటి బ్లాక్‌బస్టర్ కూడా 28 రోజులకే ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. నాలుగు వారాలుగా ఇరుముడి రన్నింగ్ షేర్స్ తెస్తూనే ఉంది.. థియేటర్స్‌లో ఇంకా సినిమాను చూస్తున్నారు ఆడియన్స్. అంతలోనే దాని ఓటిటి డీల్ పేరు చెప్పి.. బలవంతంగా ఆ థియెట్రికల్ రన్‌ను చంపేసారు. డిజిటల్లో రాకపోయుంటే మరో వీకెండ్ ఇరుముడి మంచి వసూళ్లే తెచ్చుకునేది కానీ 4 వీక్స్ ఓటిటి విండో ఆ రన్‌ను ఆపేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్‌కు కూడా ఇదే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్.. ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటిటి సంస్థలు.. 8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్టైతే ఓకే కానీ ఫ్లాపైతే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా..! ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పైగా పైరీసిని తట్టుకుని సినిమా 8 వారాలు నిలబడదనే ఎంత పెద్ద సినిమానైనా 4 వారాల్లో ఇస్తున్నామనేది మనోళ్ల వాదన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు

కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే

Follow Us