మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కోతులు, పిచ్చి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. పట్టపగలే దాడులు పెరగడంతో స్థానికులు భయపడుతున్నారు. గత నెలలో చిన్నారులపై కోతులు దాడి చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు వాపోయారు. సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.