AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌ న్యూస్‌.. ఏపీలో 378 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) పోలీస్ శాఖలో 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్ ఎస్‌ఐ, రిజర్వ్ ఎస్‌ఐ (AR), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ ఉత్తీర్ణత ప్రధాన విద్యార్హత కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది..

గుడ్‌ న్యూస్‌.. ఏపీలో 378 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
AP Police Sub Inspector Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 22, 2026 | 9:46 AM

Share

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పోలీస్ ఎస్‌పీఎఫ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 378 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీని బోర్డు త్వరలోనే ప్రకటించనుంది.

ఏపీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వివరాలు

  • ఎస్‌సీటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) – పురుషులు, మహిళలు పోస్టుల సంఖ్య: 253
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్) – పురుషులు, మహిళలు పోస్టుల సంఖ్య: 116
  • సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) – పురుషులు పోస్టుల సంఖ్య: 9

అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. వయోపరిమితి, ఇతర రిజర్వేషన్ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదార్ఢ్య కొలతలు (PMT), దేహదార్ఢ్య పరీక్షలు (PET), తుది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు పే స్కేల్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీలు, ఫీజు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను SLPRB AP అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది.

ఏపీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ