వైసీపీ
వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా 2010 నవంబరు 29న ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. 2010 డిసెంబరు 7న కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పులివెందులలో ప్రకటించారు. 2011 మార్చిలో తన పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు. సమైక్యవాద నినాదంతో ఏపీలో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 స్థానాలు సాధించి వైఎస్ జగన్ నవ్యాంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్ని్కల్లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ ప్రకటించిన జనాకర్షక పథకాలు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. 2014 ఎన్నికల్లో 44.47 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ.. 2019లో తన ఓటింగ్ శాతాన్ని 49.95 శాతానికి పెంచుకుంది. సమైక్యవాద నినాదం కారణంగా 2014లో తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.