AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హోలీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది

2024లో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఇప్పటివరకు మొత్తం దాదాపు 6 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇందులో హ్యాట్రిక్ హిట్స్ ఉండడం మరో విశేషం. ఇప్పుడు కూడా ఈ టాలీవుడ్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Tollywood: హోలీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది
Tollywood Actress
Basha Shek
|

Updated on: Mar 04, 2026 | 7:25 PM

Share

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ రంగుల పండగలో పాల్గొంటున్నారు. అలాగే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆ తర్వాత తమ హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అలా సినిమా తారలు షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా ఆ కోవలోదే. అందులో ఉన్నది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అరంగేట్రం నుంచి ఇప్పటివరకు అన్నీ చిన్న సినిమాల్లోనే నటించినా సాలిడ్ హిట్స్ సొంతం చేసుకుంది. 2024లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సుమారు అరడజనుకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. అందులో దాదాపు అన్నీ హిట్ సినిమాలే. అలాగే ఈ క్యూటీ ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ కూడా ఉన్నాయి. పేరుకు ముంబై హీరోయినే అయినా గలగలా తెలుగు మాట్లాడే ఈ బ్యూటీ మరెవరో కాదు నయన్ సారిక. అదేనండి.. లేటెస్ట్ గా శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ సినిమాలో నటించిన హీరోయిన్.

సుమారు రెండేళ్ల క్రితం ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైంది సారిక. ఆ తర్వాత ‘క’, ‘ఆయ్‌’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అలాగే వృషభ అనే పాన్ ఇండియా మూవీలోనూ యాక్ట్ చేసింది సారిక. తన క్యూట్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక తాజాగా ఈ బ్యూటీ నటించిన విష్ణు విన్యాసం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత వారం రిలీజైన ఈ సినిమా కూడా హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

ఇవి కూడా చదవండి

హోలీ వేడుకల్లో నయన్ సారిక..

ఇక నయన్ సారిక చేతిలో ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రాకాస ఒకటి. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. దీంతో పాటు ఓ కన్నడ సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది నయన్ సారిక. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

రాకాస టీమ్ హోలీ సెలబ్రేషన్స్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us