AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: శివ్ బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని.. మోకాళ్లపై తిరుమల శ్రీవారి కొండ ఎక్కిన ప్రియాంక.. వీడియో ఇదిగో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దాదాపు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే టాప్-5 లో ఎవరుంటారు? కప్పు ఎవరు కొడతారు అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన శివ్ గెలవాలని అతని ప్రియురాలు ప్రియాంక జైన్ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కింది.

Bigg Boss Telugu 10: శివ్ బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని.. మోకాళ్లపై తిరుమల శ్రీవారి కొండ ఎక్కిన ప్రియాంక.. వీడియో ఇదిగో
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 2:38 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 12 వ వారం కూడా దాదాపు తుది అంకానికి చేరుకుంది. దీంతో హౌస్‌లో ఉన్న వారిని గెలిపించేందుకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెగ కష్టపడుతున్నారు. తమ కంటెస్టెంట్ కు ఓట్లు వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక చాలామంది కంటెస్టెంట్ల తరఫున పీఆర్ టీమ్ లు కూడా శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే తన ప్రియుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కప్పు గెలవాలంటూ మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కి, శ్రీవారిని దర్శించుకుంది ఓ అందాల తార. ఆమె మరెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా శివ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అతనికి అన్ని విధాలుగా సపోర్టుగా నిలుస్తోంది ప్రియాంక. శివ్ కు సపోర్టుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు, వీడియోలు చేస్తోంది. అలాగే శివ్ పై నెగెటివిటీ పోస్టులు పెడుతున్న వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. ఇక ఇటీవలే ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లింది ప్రియాంక. అక్కడ శివ్ తో కలిసి ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. ఇక ఇప్పుడు శివ్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలని కోరుకుంటూ తిరుమలకు యాత్ర చేపట్టింది ప్రియాంక. మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదే క్రమంలో తన తిరుమల శ్రీవారి యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది.

‘నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు శివ నా కోసం తిరుమలకు వెళ్లారు. ఇప్పుడు శివ కోసం నేను కూడా ఏడుకొండలవాడి దగ్గరకు వచ్చాను. బిగ్ బాస్ లో శివ్ ప్రయాణం విజయవంతం కావాలి.. ఓం నమో వెంకటేశాయ’ అని తన పోస్టులో కోరింది ప్రియాంక. ప్రస్తుతం ఈ బుల్లితెర నటి షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రియాంక, శివ్ లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us