AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కమెడియన్ ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి.. సందడి చేసిన సినీతారలు..

ఒకప్పుడు తన నటనతో, కామెడీ టైమింగ్, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటులలో ఎంఎస్ నారాయణ ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.. 2015లో కన్నుమూశారు.. తాజాగా ఆయన మనవరాలి పెళ్లి ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tollywood : కమెడియన్ ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి.. సందడి చేసిన సినీతారలు..
Ms Narayana Grand Daughter
Rajitha Chanti
|

Updated on: Nov 26, 2026 | 2:37 PM

Share

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఓవైపు పలువురు హీరోహీరోయిన్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు నిశ్చితార్థం వేడుకలు జరుపుకున్నారు. అయితే తాజాగా దివంగత ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుటుంబంలో శుభకార్యం ఘనంగా జరిగింది. ఆయన మనవరాలి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు రావు రమేష్ హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ అభిమానులు, సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుకలో నటుడు రావు రమేష్ పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఆ సమయంలో ఎంఎస్ నారాయణ కొడుకు సైతం పక్కనే ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకలో రావు రమేష్ కనిపించడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వేడుకకు సంబంధించిన క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, పదునైన డైలాగ్ డెలివరీతో ఎంఎస్ నారాయణ కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన పోషించిన అనేక పాత్రలు, కామెడీ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో, టీవీలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఎన్నో మరపురాని జ్ఞాపకాలను మిగిల్చిన ఎంఎస్ నారాయణ 2015లో కన్నుమూశారు. ఆయనకు విక్రమ్, శశికిరణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి..

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us