AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

గత వారమే స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు తిరగరాసేస్తోంది. ఈ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చిన మొదటి 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

OTT Movie: 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 03, 2026 | 5:23 PM

Share

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మాత్రం ఓటీటీ రికార్డులు తిరగరాసేస్తోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించిన ట్విస్టులతో థ్రిల్లింగ్ కంటెంట్ ఉండడంతో ఓటీటీ ప్రేక్షకులు తెగ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తొలి 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగి కూతురు అకస్మాత్తుగా అదృశ్యం అవుతోంది. సాధారణంగా ఒక అమ్మాయి కనిపించకపోతే అది కేవలం మిస్సింగ్ కేసు అనుకుంటాం. కానీ ఆమె మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లో ఉన్న రహస్యాలు, ఆమె కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనేది అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సిరీస్ చూస్తుంటే మన చుట్టూ జరిగే కథలా అనిపిస్తుంది. ఇందులో ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ఊహించని మలుపులతో ముగిసే క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీ రికార్డులను తిరగరాసేస్తోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుట లేదు. గత వారమే స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే 90s వెబ్ సిరీస్ ఫేమ్ వాసంతిక మరో కీలక పాత్రలో కనిపించింది. వీరితో పాటు చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను ఓ పవర్ఫుల్ పాత్రలో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడీ సిరీస్ 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసినట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ’75 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్. ప్రసాద్ రావు, అతని కూతురు ఇంటర్నెట్‌లో తుఫాను క్రియేట్ చేస్తున్నారు. డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ 75 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారు?
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
అద్భుతమైన హీరోయిన్.. అయినా అదృష్టమే కలిసి రాలేదు..
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్..!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర