Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్ ఇదే!
Bank Holidays: వచ్చే నెల ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఈ సెలవు రోజుల్లో మీరు బ్రాంచ్‌లో చెక్కును క్లియర్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేయాలన్నా లేదా విత్‌డ్రా చేయాలన్నా..

Autust Bank Holidays: వచ్చే నెల ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఐదు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతో పాటు, వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మరో ఏడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ నెలలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈ సెలవు దినాలు మినహా మీరు బ్యాంకుకు వెళ్ళవచ్చు.
| తేదీ | రోజు | ప్రాంతం / నగరాలు | కారణం |
| 2 ఆగస్టు | ఆదివారం | దేశవ్యాప్తంగా | వారాంతపు సెలవు |
| 4 ఆగస్టు | మంగళవారం | అగర్తలా | కేర్ పూజ (Ker Puja) |
| 8 ఆగస్టు | శనివారం | దేశవ్యాప్తంగా / గంగ్టక్ | రెండవ శనివారం / తెండోంగ్ లో రుమ్ ఫాత్ |
| 9 ఆగస్టు | ఆదివారం | దేశవ్యాప్తంగా | వారాంతపు సెలవు |
| 13 ఆగస్టు | గురువారం | ఇంఫాల్ | పేట్రియాట్స్ డే (Patriots’ Day) |
| 15 ఆగస్టు | శనివారం | దేశవ్యాప్తంగా | స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) |
| 16 ఆగస్టు | ఆదివారం | దేశవ్యాప్తంగా | వారాంతపు సెలవు |
| 19 ఆగస్టు | బుధవారం | అగర్తలా | మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి |
| 22 ఆగస్టు | శనివారం | దేశవ్యాప్తంగా | నాలుగో శనివారం |
| 23 ఆగస్టు | ఆదివారం | దేశవ్యాప్తంగా | వారాంతపు సెలవు |
| 25 ఆగస్టు | మంగళవారం | విజయవాడ, కొచ్చి, తిరువనంతపురం | మిలాద్-ఉన్-నబి / మొదటి ఓణం |
| 26 ఆగస్టు | బుధవారం | హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో | ఈద్-ఎ-మిలాద్ / తిరువోణం |
| 28 ఆగస్టు | శుక్రవారం | అహ్మదాబాద్, భోపాల్, జైపూర్, లక్నో, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో | రక్షాబంధన్ / శ్రీ నారాయణ గురు జయంతి |
| 30 ఆగస్టు | ఆదివారం | దేశవ్యాప్తంగా | వారాంతపు సెలవు |
మీరు బ్రాంచ్‌లో చెక్కును క్లియర్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేయాలన్నా లేదా విత్‌డ్రా చేయాలన్నా, డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేయాలన్నా, లేదా ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయాలన్నా, ముందుగా మీ నగరం బ్యాంకు సెలవుల జాబితాను తప్పకుండా తనిఖీ చేసుకోండి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగే స్థానిక పండుగలను బట్టి ఆర్‌బిఐ సెలవుల క్యాలెండర్ మారవచ్చు. సరైన ప్రణాళిక చివరి నిమిషంలో కలిగే ఇబ్బందులను నివారించడంలో మీకు సహాయపడుతుంది.
డిజిటల్ సేవలు అందుబాటులోనే ఉంటాయి:
బ్యాంక్ శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ క్రింది ఆన్‌లైన్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. UPI (PhonePe, Google Pay, Paytm మొదలైనవి) నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATMలలో నగదు ఉపసంహరణ/జమ, డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు యధావిధిగా పని చేస్తాయి.
ముఖ్య గమనిక: రాష్ట్రాలు, ప్రాంతీయ పండుగలను బట్టి సెలవులు మారే అవకాశం ఉన్నందున, మీ స్థానిక బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లే ముందు మీ ప్రాంతానికి వర్తించే సెలవుల వివరాలను సరిచూసుకోవడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
