AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వామ్మో కొద్దిలో మిస్.. వందేభారత్‌లో ఫుడ్‌ ఆర్డర్..తినేముందు కనిపించింది చూసి

ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్న సంస్థల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తోంది. తాజాగా వందే భారత్ రైలులో చోటుచేసుకున్న ఘటన ఆహార నాణ్యతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రైలులో భోజనం ఆర్డర్ చేసిన ఓ ప్రయాణికుడికి ఊహించని షాక్ ఎదురైంది. తినేందుకు ఇచ్చిన వడలో ఏకంగా ఓ భారీ నట్‌బోల్ట్ కనిపించడంతో అతను అవాక్కయ్యారు.

Viral News: వామ్మో కొద్దిలో మిస్.. వందేభారత్‌లో ఫుడ్‌ ఆర్డర్..తినేముందు కనిపించింది చూసి
Vande Bharat Food Quality Row
Anand T
|

Updated on: Nov 29, 2026 | 4:01 PM

Share

వందే భారత్ ట్రైన్‌లో భోజనం ఆర్డర్ చేసిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతను ఆర్డర్ చేసిన ఆహారంలో భారీ ఇనుప నట్‌బోల్ట్ ప్రత్యక్షమైంది. అది చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి బెలగావికి వెళ్తున్న సమర్థ్ కోడియల్ అనే ప్రయాణికుడు వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో భోజనం ఆర్డర్ చేశారు. సిబ్బంది తీసుకువచ్చిన భోజనంలో భాగంగా ఇచ్చిన వడలో భారీ బోల్ట్ కనిపించిందని ఆయన తెలిపారు. అది చూసి ఒక్కసారిగా షాకైన ప్రయాణికుడు, రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతూ అందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’ (X) వేదికగా పోస్ట్ చేశారు. వాటిలో ప్లేట్‌లో సగం తిన్న వడ పక్కన బోల్ట్ స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనపై రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారడంతో ఘటనపై IRCTC స్పందించింది. ఈ ఘటనతో ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

అంతేకాకుండా రైళ్లలో భోజనం అందించే సిబ్బందికి నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP) కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. వంట చేసే ముందే కిచెన్ మొత్తాన్ని తనిఖీ చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపింది. అలాగే కిచెన్‌లో ఉపయోగించే పరికరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు IRCTC స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us