AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సినిమాలో ట్విస్ట్ కు ఉంటాయి మావ.! ఓటీటీలోకి వచ్చేస్తున్నా రూ.268 కోట్ల మూవీ

ఓటీటీల్లో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ఇంటిల్లిపాది సినిమాలు రిపీట్ మోడ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

ఈ సినిమాలో ట్విస్ట్ కు ఉంటాయి మావ.! ఓటీటీలోకి వచ్చేస్తున్నా రూ.268 కోట్ల మూవీ
movie
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2026 | 3:29 PM

Share

వారం వారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు రకరకాల సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?  ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఊహించని ట్విస్ట్ లు సినిమాలో చాలానే ఉంటాయి. ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపింది. నిజానికి ఇది ఒక తమిళ్ సినిమా కానీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి మన దగ్గర కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకూ ఈ సినిమా ఎదో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సీన్.

సూర్యకు జోడీగా అందాల భామ నజ్రియా నజీమ్ నటించగా..  యంగ్ యాక్టర్ నస్లెన్ కీలక పాత్రలో నటించాడు. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన సన్నివేశాలు, ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా సూర్య నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఈ ఏడాది సీన్ సినిమాతో సూర్య బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ‘సీన్’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఒప్పందం జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4 నుంచి ‘సీన్ ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us