AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసా?

బర్త్ డే పార్టీలు, ఏవైనా చిన్న చిన్న ఈవెంట్స్‌కు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో కేక్ కట్ చేస్తుంటారు. అయితే చాలా మందికి బయట కేక్ తినడం ఇష్టం ఉండదు. అలాగే ఇంటిలో ప్రిపేర్ చేసుకోవడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పుడు మనం కోకో పౌడర్ వంటివి లేకుండా చాలా సింపుల్‌గా ఇంటిలో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 29, 2026 | 1:22 PM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..   తురిమిన చాక్లెట్: అర కప్పు,గోరువెచ్చని పాలు: అర కప్పు,పంచదార: అర కప్పు,ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్: ఒక టీ స్పూన్,ఫ్లేవర్ లేని ఆయిల్ : పావు కప్పు, పెరుగు: అర కప్పు, మైదా పిండి: ఒక కప్పు,  బేకింగ్ సోడా: అర టీ స్పూన్,  బేకింగ్ పౌడర్: ఒక టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్

1 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా, కేక్ తయారు చేయడానికి కేక్ ప్యాన్‌ను సిద్ధం చేసుకోవాలి. మీ వద్ద కేక్ ప్యాన్ లేకపోతే, ఏదైనా ఫ్లాట్ అడుగు ఉండే స్టీల్ లేదా అల్యూమినియం బౌల్‌ను ఉపయోగించవచ్చు. కేక్ బ్యాటర్ కలపడానికి ముందే, టిన్‌కు నూనె రాసి, దానిపై బట్టర్ పేపర్ వేయండి. బట్టర్ పేపర్ లేకపోతే, నూనె రాసిన తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లి సిద్ధం చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులోకి అర కప్పు తురిమిన చాక్లెట్‌ వేయాలి. ఆ తర్వాత, అర కప్పు గోరువెచ్చని పాలు , అర కప్పు పంచదార, ఒక టీ స్పూన్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌ను కలపాలి. చక్కెర, చాక్లెట్ పూర్తిగా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేయాలి. చాక్లెట్ మిశ్రమం కరిగిన తర్వాత, పావు కప్పు ఫ్లేవర్ లేని సన్‌ఫ్లవర్ ఆయిల్, అర కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగులో ముద్దలు లేకుండా సిల్కీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి.

3 / 5
  తర్వాత దీనిపై జల్లెడ పెట్టి, ఒక కప్పు మైదా పిండి, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించాలి. జల్లించిన పొడి పదార్థాలను తడి మిశ్రమంతో బాగా కలపాలి.  పిండి జారేలా ఉండాలి.  సిద్ధం చేసుకున్న కేక్ బ్యాటర్‌ను నూనె రాసి, బట్టర్ పేపర్ వేసిన కేక్ టిన్‌లోకి పోయండి. బ్యాటర్ వేసిన తర్వాత, టిన్‌ను ఒకటి లేదా రెండు సార్లు కిందకు ట్యాప్ చేయండి. దీనివల్ల బ్యాటర్‌లో ఉన్న గాలి బుడగలు పోయి కేక్ సమానంగా బేక్ అవుతుంది. ఐచ్ఛికంగా, పైన తరిగిన డ్రై ఫ్రూట్స్‌ను చల్లుకోవచ్చు.

4 / 5
మరోపక్క, ఒక మందపాటి కడాయిలో స్టాండ్ ఉంచి, మీడియం ఫ్లేమ్‌లో 5-10 నిమిషాలు ప్రీ-హీట్ చేయండి. ప్రీ-హీట్ అయిన కడాయిలో కేక్ టిన్‌ను ఉంచి, మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో 25-30 నిమిషాలు బేక్ చేయండి.25 నిమిషాల తర్వాత, టూత్‌పిక్‌ను కేక్ మధ్యలో గుచ్చి చూస్తే, టూత్‌పిక్ శుభ్రంగా బయటకు వస్తే, కేక్ బేక్ అయినట్లు. ఒకవేళ తడిగా ఉంటే, మరో 5-10 నిమిషాలు బేక్ చేయండి.కేక్ బేక్ అయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, కేక్ టిన్‌ను బయటకు తీయండి. కేక్ చల్లబడే వరకు దానిపై ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌ను కప్పి ఉంచండి. ఇది కేక్ గట్టిపడకుండా, లోపలికి కుంగిపోకుండా స్పాంజిగా ఉండేలా చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత, కత్తితో అంచులు లూస్ చేసి, ఒక ప్లేట్ పెట్టి బోర్లుంచి ట్యాప్ చేస్తే, కేక్ సులభంగా టిన్ నుండి బయటకు వస్తుంది. అంతే కేక్ రెడీ.

5 / 5
Follow Us
ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఎల్‌నీనో టైంలోనే కనిపించే ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా..

ప్లేయింగ్ 11లో లేడు.. కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా పనికిరాని సిరాజ్

కారులోకి ఎక్కితే చాలు.. మినీ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లినట్లే!

ఆ హీరోయిన్ ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది..

రుచికరమైన ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు తయారీ నిమిషాల్లోనే..

తల్లి SI పరీక్ష రాసే వరకు చిన్నారికి అమ్మగా మారిన పోలీస్!

IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం..

డిసెంబర్ చివరలో తప్పక వెళ్లాల్సిన అద్భుతమైన ప్రదేశాలివే!