AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!

Underrated Players: ఐపీఎల్ 2027 మినీ వేలంలో స్టార్ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్‌ప్రెడిక్టబుల్ ప్లేయర్లు భారీ ధర పలికే అవకాశముంది. నిఖిల్ చౌధరి, ఉదయ్ సహారన్, శై హోప్ తమ ప్రతిభతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించవచ్చు. ఈ ముగ్గురిపై వేలంలో ఆసక్తికరమైన పోటీ జరిగే అవకాశం ఉంది.

IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!
Ipl 2027 Mini Auction
Venkata Chari
|

Updated on: Nov 29, 2026 | 12:58 PM

Share

Underrated Players: ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 16న గోవాలో ఈ వేలం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వేలం కోసం 1220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 939 మంది భారత ఆటగాళ్లు కాగా, 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలకు కలిపి 66 ఆటగాళ్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వేలంలో గరిష్టంగా 66 మంది ఆటగాళ్లను మాత్రమే జట్లు కొనుగోలు చేయనున్నాయి.

ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లపై భారీ ధరలు పలుకుతాయని అంచనాలు ఉన్నాయి. అయితే, పెద్దగా ప్రచారం లేని కొందరు ఆటగాళ్లు కూడా వేలంలో అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశముంది. అలాంటి ముగ్గురు ఆటగాళ్లపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

1. నిఖిల్ చౌధరి..

ఈ జాబితాలో మొదటి పేరు ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నిఖిల్ చౌధరి. గత రెండు, మూడు సంవత్సరాలుగా బిగ్ బాష్ లీగ్‌తో పాటు ఇతర ఫ్రాంచైజీ టీ20 టోర్నీల్లో అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు. నిఖిల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. మిడిల్ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతడికి ఉంది. అలాగే లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతడు తన ఆటతో ఆకట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ 2027 వేలంలో నిఖిల్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అతడికి భారీ ధర దక్కవచ్చని అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

2. ఉదయ్ సహారన్..

భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉదయ్ సహారన్ కూడా ఐపీఎల్ 2027 వేలంలో కీలకంగా మారే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అతడు మంచి ప్రదర్శన చేస్తున్నాడు. దూకుడుగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో టాప్ ఆర్డర్‌లో బ్యాటర్ కోసం చూస్తున్న జట్లకు అతడు మంచి ఎంపిక కావచ్చు. ఇప్పటివరకు 7 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉదయ్ సహారన్ 176.03 స్ట్రైక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ శైలి, యువ ఆటగాడిగా ఉన్న అవకాశాలు వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించవచ్చు. దీంతో అతడిపై కూడా భారీ బిడ్డింగ్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

3. షాయ్ హోప్..

వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కూడా ఐపీఎల్ 2027 వేలంలో భారీ ధర పలికే అవకాశమున్న ఆటగాళ్లలో ఒకడు. ఇటీవల భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో అతడి పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. షాయ్ హోప్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మాత్రమే కాకుండా వికెట్ కీపర్ కూడా. అంతేకాకుండా కెప్టెన్సీ అనుభవం ఉండటం అతడికి అదనపు బలం. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, నాయకత్వ లక్షణాలు కలిగిన ఆటగాడి కోసం చూస్తున్న జట్లకు హోప్ మంచి ఎంపిక కావచ్చు. ముఖ్యంగా KKR, LSG వంటి జట్లు అతడిపై ఆసక్తి చూపే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ వేలంలో స్టార్ ఆటగాళ్లతో పాటు ఈ ముగ్గురు అన్‌ప్రెడిక్టబుల్ ప్లేయర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలం రోజు వీరిలో ఎవరికి భారీ ధర దక్కుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us