Sukumar-Allu Aravind: సుకుమార్‌తో అల్లు అరవింద్ ఛాలెంజ్.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. లక్ష చెక్కు రాసిచ్చి..
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ కాసిన ఓ ఛాలెంజ్ లో సుకుమార్ ఓడిపోయారు. దీంతో తాను అన్నట్లుగానే లక్ష చెక్ రాసిచ్చారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందామా.

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మధ్య జరిగిన ఓ సరదా సవాలు, దానికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆకాశంలో ఒక తార సినిమా చూసి సుకుమార్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ సవాలులో ఓడిపోయారు. దీంతో అల్లు అరవింద్ పేరుతో లక్ష రూపాయల చెక్ రాసి ఆ ఫొటోను సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. ఆకాశంలో ఒక తార చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా చూసిన తర్వాత సుకుమార్‌కు అరవింద్ ఫోన్ చేసి ఆసక్తికరమైన సవాలు విసిరారు. “సుకుమార్.. ఆకాశంలో ఒక తార సినిమా చూడు. సినిమా పూర్తయ్యే వరకు కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను. ఒకవేళ కన్నీళ్లు వస్తే నువ్వు నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి” అని అరవింద్ సరదాగా ఛాలెంజ్ చేశారు. ఈ సవాలును స్వీకరించిన సుకుమార్ సినిమా చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సవాలు నిబంధన ప్రకారం అల్లు అరవింద్‌కు లక్ష రూపాయల చెక్ అందజేస్తూ.. “ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది” అంటూ సరదాగా అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార సైన్స్-ఫిక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. ఇందులో దుల్కర్ సల్మాన్‌తో పాటు సాత్విక వీరవల్లి కీలక పాత్రలో నటించారు. చుట్టుపక్కల వారి నిరుత్సాహం, తల్లిదండ్రుల నిర్ణయాల మధ్య కల్పన అనే ప్రతిభావంతురాలైన విద్యార్థిని తన కలను ఎలా చేరుకుంది, మధ్యతరగతి మెకానిక్ కృష్ణ ఆమెకు ఎలా అండగా నిలిచాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ, ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రం RC17 పనులతో బిజీగా ఉన్నారు. సుకుమార్, అల్లు అరవింద్ మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
సుకుమార్..

Sukumar Post
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
