AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: ఆడవాళ్లంటే రోబోలు కాదు, వాళ్లకు కొన్ని కలలు ఉంటాయి : రేణు దేశాయ్

వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన, పరస్పర సహకారంపై నటి రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ‘శ్రీమతి’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, పెళ్లయిన తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, భర్తల బాధ్యతలపై తన మనసులోని మాటను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు.

Renu Desai: ఆడవాళ్లంటే రోబోలు కాదు, వాళ్లకు కొన్ని కలలు ఉంటాయి : రేణు దేశాయ్
Renu Desai
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2026 | 2:31 PM

Share

ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి వివాహిత జీవితంలో తనకు అండగా నిలిచే భర్త ఉండటం ఎంతో ముఖ్యం. పెళ్లయిన ప్రతి మగాడు తన భార్య మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం ఇంటి పనుల్లోనే కాదు, పిల్లల పెంపకం మరియు ఇతర బాధ్యతల్లోనూ భర్తలు సమాన భాగస్వాములు కావాలి. ఇప్పటికే తమ భార్యలకు అండగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న భర్తలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇలాగే కొనసాగుతూ, మిగిలిన పురుషులకు ఆదర్శంగా నిలవాలి’’ అని పిలుపునిచ్చారు.

మహిళల వ్యక్తిగత గుర్తింపు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆడవాళ్లంటే కేవలం పనులు చేసే రోబోలు కాదు. వాళ్లకు కూడా ఒక మనసు ఉంటుంది, కొన్ని వ్యక్తిగత లక్ష్యాలు, కలలు ఉంటాయి. అది డ్యాన్స్ కావచ్చు, పాట కావచ్చు లేదా మరేదైనా రంగం కావచ్చు. తమ భార్యల ఆశయాలను గౌరవించి, వారి అస్తిత్వం కోసం మగాళ్లు ఆలోచించాలి’’ అని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు.

ఇదే వేదికపై స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల గురించి ప్రస్తావిస్తూ రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించారు. ‘‘రాజీవ్ కనకాల లాంటి సపోర్టివ్ భర్త దొరకడం నిజంగా సుమ అదృష్టం. కెరీర్ పరంగా ఆయన సుమకు అంతటి ప్రోత్సాహం అందించకపోయి ఉంటే, ఈరోజు మనం సుమలాంటి ఒక గొప్ప యాంకర్‌ను మిస్ అయ్యేవాళ్లం’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళల ఆత్మగౌరవం, కెరీర్‌కు సంబంధించి రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us