AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!

India vs New Zealand Test: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో టీమిండియా విజయావకాశాలు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌పై ఆధారపడి ఉన్నాయి. కివీస్ ఇప్పటికే 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు తొలి సెషన్‌లోనే మిగిలిన వికెట్లు త్వరగా పడగొట్టి, న్యూజిలాండ్‌ను 300 పరుగుల లోపు ఆధిక్యానికి పరిమితం చేయాలి.

IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
India Vs New Zealand Test
Venkata Chari
|

Updated on: Nov 29, 2026 | 1:48 PM

Share

India vs New Zealand Test: భారత్, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు కీలక దశకు చేరుకుంది. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు మొత్తం ఆధిక్యం 243 పరుగులకు చేరుకుంది. ఇంకా కివీస్ చేతిలో 7 వికెట్లు ఉండటంతో నాలుగో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. భారత్ మ్యాచ్‌లో నిలవాలంటే న్యూజిలాండ్‌ను వీలైనంత తక్కువ స్కోరుకు పరిమితం చేయాలి.

నాలుగో రోజు భారత్ ఏం చేయాలి?

క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదన రికార్డులు భారత జట్టుకు ఆశలు కలిగిస్తున్నాయి. ఈ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించాయి. ఈ లక్ష్యాలు 104 నుంచి 285 పరుగుల మధ్య ఉన్నాయి.

అయితే 300 పరుగులకు మించిన లక్ష్యాలను ఛేదించడంలో జట్లకు ఇక్కడ అంతగా విజయాలు లభించలేదు. 300కు పైగా లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసిన జట్లు రెండింటిలో ఓడిపోయాయి. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

ఈ నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు సగటున దాదాపు 122 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి. ప్రతి సందర్భంలోనూ ఇన్నింగ్స్ 93 ఓవర్లకు పైగా కొనసాగింది. అందుకే భారత్ నాలుగో రోజు తొలి సెషన్‌లోనే న్యూజిలాండ్ మిగిలిన 7 వికెట్లను త్వరగా పడగొట్టాలి. కివీస్ ఆధిక్యం 300 పరుగులు దాటకుండా చూడటం టీమిండియాకు అత్యంత కీలకం.

న్యూజిలాండ్‌లో నాలుగో ఇన్నింగ్స్ రికార్డులు ఆసక్తికరం..

న్యూజిలాండ్ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్‌లో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించాలంటే భారత్ చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌లో టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది.

గత ఏడాది ఇదే హెగ్లీ ఓవల్ మైదానంలో వెస్టిండీస్ 531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 163.3 ఓవర్లలో 457 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

న్యూజిలాండ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు విజయవంతంగా ఛేదించిన అత్యధిక లక్ష్యం 345 పరుగులు. 1969లో ఆక్లాండ్‌లో వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

21వ శతాబ్దంలో న్యూజిలాండ్ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు హెగ్లీ ఓవల్ మైదానంలోనే నమోదయ్యాయి.

– 2023: న్యూజిలాండ్, శ్రీలంకపై 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

– 2024: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: 91 బంతుల్లో 12 పరుగులు.. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!

ఈ రికార్డులను చూస్తే భారత్‌కు నాలుగో రోజు బౌలింగ్ అత్యంత కీలకంగా మారింది. న్యూజిలాండ్ ఆధిక్యం 300 పరుగులు దాటితే భారత జట్టుకు మ్యాచ్ గెలవడం కష్టమయ్యే అవకాశం ఉంది. కివీస్‌ను త్వరగా ఆలౌట్ చేసి తక్కువ లక్ష్యాన్ని అందుకుంటే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..?
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..?
చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోతున్నారా..? అయితే, ఇది మీ కోసమే!
చలికాలంలో సాక్స్ వేసుకుని నిద్రపోతున్నారా..? అయితే, ఇది మీ కోసమే!
రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ నుంచే పూర్తి చేయడం ఎలా..?
రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ నుంచే పూర్తి చేయడం ఎలా..?
మొదటి అడుగు వేయడానికి భయపడుతున్నారా? ఈ యువకుడి కథ మీకు గొప్ప పాఠం
మొదటి అడుగు వేయడానికి భయపడుతున్నారా? ఈ యువకుడి కథ మీకు గొప్ప పాఠం
ఏడిస్తే లక్ష.. ఎడవకపోతే కోటి.. సుకుమార్, అల్లు అరవింద్ ఛాలెంజ్ ..
ఏడిస్తే లక్ష.. ఎడవకపోతే కోటి.. సుకుమార్, అల్లు అరవింద్ ఛాలెంజ్ ..
రోజుకు 10 వేల అడుగులు నడిస్తే సరిపోతుందా? పూర్తి ఫిట్‌నెస్ కోసం .
రోజుకు 10 వేల అడుగులు నడిస్తే సరిపోతుందా? పూర్తి ఫిట్‌నెస్ కోసం .
తాలింపు అన్నం.. ఇలా చేస్తే లంచ్ బాక్సుల్లోకి బెస్ట్
తాలింపు అన్నం.. ఇలా చేస్తే లంచ్ బాక్సుల్లోకి బెస్ట్
ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ పథకాల్లో సమస్యలున్నాయా.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఎల్‌నీనో టైంలోనే కనిపించే ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా..
ఎల్‌నీనో టైంలోనే కనిపించే ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా..