ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్
ఐసీసీ టెస్ట్ ఫార్మాట్‌లోనూ వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. దీనిని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా పిలుస్తున్నారు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇప్పటికే రెండు ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్, రెండో ఎడిషన్ విజేతగా ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అయితే, ఈ రెండు ఎడిషన్లలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇక మూడవ ఎడిషన్ జూన్ 2023లో ది యాషెస్‌తో ప్రారంభమైంది. లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో అంటే జూన్ 2025లో ఇది ముగుస్తుంది. టోర్నీలో 27 సిరీస్‌లు, లీగ్ దశలో 69 మ్యాచ్‌లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లండన్‌లోని లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో పోటీపడతాయి. ప్రతి జట్టు ఆరు సిరీస్‌లను ఆడుతుంది. మూడు స్వదేశంలో, మూడు విదేశాలలో ఆడుతుంది. ప్రతి సిరీస్‌లో రెండు నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి