భూపాలపల్లి జిల్లా మాధారం గ్రామ శివార్లలోని పెద్దవాగులో అతి పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇసుకలో కూరుకుపోయి ఉన్న ఈ విగ్రహాన్ని స్థానికులు అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. భక్తులు దీనిని దైవ సంకల్పంగా భావిస్తూ, విగ్రహానికి గుడి కట్టేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.