Vijay,Rashmika: తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.. గతకొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ రోజు(మార్చి 4)న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
ఈ వేడుకలు సినీ సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అభిమానులకు విజయ్, రష్మిక ఓ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆంక్షల కారణంగా ఆహ్వానం లేకుండా అతిధులు రావద్దు అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇక ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ రష్మిక మీడియాతో ముచ్చటించారు.
మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ
ఈ ప్రెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ.. తెలుగు స్టేట్స్ కు కొత్త కోడలు వచ్చింది మంచిగా చూసుకోండి అని సరదాగా అన్నారు. అలాగే రష్మిక మాట్లాడుతూ.. లైఫ్ లో ఫస్ట్ టైం ఓ పెద్ద స్టెప్ తీసుకుంటున్నాం.. మీ ఆశీర్వాదాలు కావాలి అని కోరింది.
Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ
తెలుగు స్టేట్స్ కి కొత్త కోడలు వచ్చింది ….మంచిగా చూస్కోండి
— #VijayDevarakonda #RashmikaMandanna|#Virosh pic.twitter.com/20YCl7ayfM
— cinee worldd (@Cinee_Worldd) March 4, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




