AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోతో ఎలాగైనా సినిమా చేద్దాం అనుకున్నా.. కానీ చివరకు

బిగ్ బాస్ సీజన్ 7తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నటుడు శివాజీ. ఎంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా, బిగ్ బాస్ హౌస్‌లో తన మాటతో, వైఖరితో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు శివాజీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు శివాజీ.

ఆ స్టార్ హీరోతో ఎలాగైనా సినిమా చేద్దాం అనుకున్నా.. కానీ చివరకు
Shivaji
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 3:17 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 తో శివాజీ మరోసారి ప్రేక్షకుల నోర్లలో నానారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7తో ప్రేక్షకులను పలకరించారు. ఆ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించిన శివాజీ ఆతర్వాత సైలెంట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ప్రేక్షకులను అలరించారు. శివాజీ సినిమాల విషయానికొస్తే ఒకప్పుడు నేచురల్ స్టార్ అనే బిరుదు శివాజీకి ఉండేది. యువతను తన సినిమాలతో, కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకున్నాడు శివాజీ . బిగ్ బాస్ తర్వాత 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు శివాజీ.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు శివాజీ. కోర్ట్ సినిమా శివాజీ క్రేజ్ మరింత పెంచేసింది. ఆతర్వాత దండోరా అనే సినిమా చేశారు. ఇక ఇప్పుడు సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత శివాజీ, లయ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు శివాజీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

హీరో శివాజీ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రొడక్షన్ హౌస్ కొనసాగించడం లేదు శివాజీ. దాని గురించి మాట్లాడుతూ.. తాను ఫుల్ టైం నిర్మాతగా మారాలనే ఉద్దేశ్యం లేదని ఆయన పేర్కొన్నారు. తాజ్ మహల్ అనే కన్నడ చిత్రం తనకెంతో నచ్చిందని, దానిని తెలుగులో రీమేక్ చేయాలనే ఆసక్తితో.. ఆ  ప్రాజెక్ట్‌ను హీరో రామ్ పొతినేనితో చేయాలని భావించి, దాని హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కథలో మార్పులు కూడా చేయాలనుకున్నా.. కానీ రామ్ పొతినేనితో సెట్ అవ్వలేదు, తర్వాత హీరో నిఖిల్ తో చేద్దాం అనుకున్నా.. అయితే నిఖిల్ కూడా బిజీగా ఉండటంతో కుదరలేదు. చివరకు నేనే చేశాను అని అన్నారు శివాజీ.

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us