AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Phani CH
|

Updated on: Apr 15, 2026 | 5:47 PM

Share

విజయనగరం జిల్లాకు చెందిన సాయిశ్రీ హరికృష్ణ అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. తన పుట్టినరోజునాడు కాలిఫోర్నియాలోని మెరమెక్ స్టేట్ పార్క్‌లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లగా, నీటి అడుగున చెట్టు వేళ్లలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడిన హరికృష్ణ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు.

ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఆ యువకుడు, తన పుట్టినరోజునాడే మృత్యు ఒడికి చేరాడు. పుట్టినరోజునాడు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న యువకుడు విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హరికృష్ణ 2023లో ఎంఎస్ పూర్తి చేసి, నాలుగు నెలల క్రితమే ఒక ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేరారు. శనివారం తన పుట్టినరోజు కావడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి మెరమెక్ స్టేట్ పార్క్‌కు వెళ్లారు. చిన్నప్పటి నుండి ఈతలో ప్రావీణ్యం ఉన్న హరికృష్ణ, అక్కడ ఉన్న నదిలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే, దురదృష్టవశాత్తు నీటి అడుగున ఉన్న చెట్టు వేళ్లలో కాళ్లు చిక్కుకుపోవడంతో బయటకు రాలేక నీటిలో మునిగిపోయారు. స్నేహితులు వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, వారు వచ్చే లోపే హరికృష్ణ ప్రాణాలు విడిచారు. పుట్టినరోజు నాడు కొడుకు నుంచి శుభవార్త వింటామని ఆశించిన తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమలకు.. కుమారుడి మరణవార్త పిడుగులా తగిలింది. చేతికి వచ్చిన కొడుకు ఇలా దూరమవ్వడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కాగా, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు

Jananayagan: విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ మూవీ..

Follow Us