AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

Phani CH
|

Updated on: Apr 15, 2026 | 1:31 PM

Share

విజయ్ దళపతి టీవీకే పార్టీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో హోలోగ్రాఫిక్ AI టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తోంది. AI సాయంతో విజయ్ గత ప్రసంగాలను 3D హోలోగ్రామ్స్‌గా ప్రదర్శిస్తూ, దూర ప్రాంతాల్లోనూ తన వర్చువల్ ఉనికిని చాటుతున్నారు. దీనికోసం రోజుకు ₹50,000 ఖర్చవుతుండగా, ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేక అనుమతి పొందింది. ఇది ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తోంది.

తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో విజయ్ దళపతి దూసుకుపోతున్నాడు. తను కవర్ చేయని ఏరియాలను AI టెక్నాలజీ సాయంతో చుట్టేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. AIసాయంతో తన అభ్యర్థులకు అండగా ఉంటూనే.. ప్రత్యర్థులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు. హోలో గ్రాఫిక్ AI టెక్నాలజీ ! ఇప్పుడిదే సాంకేతికతను విజయ్ అభ్యర్థులు తమ ప్రచార పర్వంలో ఉపయోగిస్తున్నారు. ప్రచార వాహనంపై అమర్చిన 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్ ద్వారా విజయ్ నిజంగా అక్కడే ఉండి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తారు. విజయ్ గత ప్రసంగాలను AI సాయంతో లిప్-సింక్ చేసి, 3D హావభావాలతో ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీలో మొదటగా ఈ టెక్నాలజీని కుంభకోణం TVK అభ్యర్థి వినోద్ రవి ఉపయోగించారు. అప్పటి నుంచి దాదాపు టీవీకే అభ్యర్థులందరూ ఈ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తూ.. విజయ్‌ తమ ప్రచారానికి రాలేని లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈ హోలోగ్రాఫిక్ AI ప్రచారం కోసం టీవీకే అభ్యర్థులు భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సిస్టమ్ కోసం రోజుకు సుమారు ₹50,000 ఖర్చు పెడుతున్నట్టు రిపోర్ట్. అంతేకాదు దీనిని ఉపయోగించడానికి ఎన్నికల కమిషన్ నుండి 4 రోజుల పాటు ప్రత్యేక అనుమతి పొందినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు

Jananayagan: విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ మూవీ..

Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Follow Us