Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మరణించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేసిన జియో న్యూస్‌కు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారతీయ కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్రసారం చేయడంపై పెమ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కళాకారుల విజయాలను గుర్తు చేయడం అవసరమని జియో న్యూస్ ఎండీ సమర్థించుకున్నారు.
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ కూడా ఈ వదంతులను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్‌లో ప్రసారం చేసింది. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేయడం నిషిద్దం. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ – పెమ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.సదరు న్యూస్ ఛానల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్‌పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ రియాక్టయ్యాడు. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని కీర్తించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందన్నాడు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

