AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు తీవ్రమయ్యాయి. 42-44°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రభావం అధికం. డీహైడ్రేషన్ నివారణకు నీరు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రైతులు, కూలీలు ఉదయం 11లోపు పనులు ముగించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలకు తోడు వడగాల్పులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 42 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం సెగలు కక్కుతోంది. బుధవారం మొత్తం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలపై వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. విజయనగరం జిల్లావ్యాప్తంగా 19 మండలాలు తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలు, శ్రీకాకుళం 4, ఏలూరు పోలవరం ప్రాంతంలోని 4 మండలాలు, అనకాపల్లిలో 2 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వీటితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండుందని హెచ్చరించింది. తీవ్రమైన ఉక్కపోత, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి సరిపడా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఉదయం 11 గంటల లోపే పనులు ముగించుకోవాలని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Telangana Weather: తెలంగాణలో పెరిగిన పగటి సమయం.. కారణం ఇదే
VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!
‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు
Jananayagan: విజయ్‌కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్‌లో ‘జననాయగన్’ మూవీ..
Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు
వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే..
వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??
గ్యాస్ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు
వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా
చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

