AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్.. కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించారు ఆయన. అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించారు ఆయనే ఏవీఎస్. ఈ లెజెండ్రీ కమెడియన్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
Avs
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2026 | 6:28 PM

Share

తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్న నటుల్లో ఏవీఎస్ ఒకరు. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆయన పాత్రను పండించేవారు. ఆడియెన్స్‌కు నవ్వులు పంచేవారు. తొలుత తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్… ఆ తరువాత విజయవాడలో విలేఖరిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్ధికంగా చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. తినడానికి డబ్బుల లేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఏవీఎస్. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సహాయ పాత్రల్లో మెప్పించారు. దాదాపు 750 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో తన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

మాయలోడు, ఘటోత్కచుడు, యమలీల, సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే, మావిడాకులు, జయం మనదేరా, అదిరిందయ్యా చంద్రం, వెంకీ, బెండు అప్పారావు, యమగోల మళ్ళీ మొదలైంది, బంగారం, శ్రీరామదాసు, రాధాగోపాళం, సంక్రాంతి, కాశి ఇలా ఎన్నో సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే చేతినిండా సినిమాలు.. నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఏవీఎస్.. అనారోగ్యం కారణంగా 2013లో మరణించారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటు. ఇప్పటికీ ఆయన లేని లోటు కనిపిస్తే ఉంటుంది.

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

కాగా ఏవీఎస్ కుటుంబం గురించి చాలా తక్కువ మందకి తెలుసు. కానీ ఆయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు చాలా సుపరిచితమైనవారే. కానీ వారిద్దరూ కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సీరియల్స్‏లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. ఏవీఎస్ కూతురు ప్రశాంతి బుల్లితెర నటుడు శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈయన ఎక్కువగా రవిబాబు మూవీస్‌లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత