AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ, యూత్ మెచ్చే కథలను మరింత అందంగా వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన నేర్పరి. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన కథలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో హ్యాపీ డేస్ ఒకటి.

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి
Happydays
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 12:10 PM

Share

సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా మంచి హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ యువతకు చాలా దగ్గరగా ఉండటంతో అంతా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో స్నేహం, ప్రేమ, గొడవలు అన్నీ యువతను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో నటించిన అందరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక నిఖిల్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమాలో అప్పుగా నటించిన అమ్మాయి గుర్తుందా..?  సినిమాలో టామ్ బాయ్ గా కనిపించి ఆకట్టుకుంది.

అప్పుగా నటించిన ఆ అమ్మడు పేరు గాయత్రి రావు. సీనియర్ నటి అయిన బెంగళూరు పద్మ కూతురు ఈమె. హ్యాపీడేస్ సినిమా తర్వాత గాయత్రి రావుకు వరుస ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు… కానీ ఆమెను అవకాశాలు పలకరించలేదు. ఆ తర్వాత చాలా కాలానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. అందులో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది గాయత్రి రావు. ఆ సినిమా కూడా ఈమెకు వరుస ఆఫర్లు తెచ్చి పెట్టలేదు.

ఆతర్వాత చిన్నచిన్న సినిమాల్లో నటించింది. ఇక 2019 లో పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడింది. పెళ్లితర్వాత గాయత్రి రావు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది గాయత్రీ రావు.  ఆ తర్వాత మరెక్కడ కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది అప్పు. గాయత్రి రావు పెళ్ళిఫోటోలు, ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Gayatri Rao

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us