AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్​ఫుల్ SUVతో వచ్చేస్తున్న Volkswagen.. తక్కువ సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందా?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ Volkswagen తన కొత్త పర్ఫార్మెన్స్ SUV T-Roc Rను ఆవిష్కరించింది. స్పోర్టీ డిజైన్‌, శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్‌, అత్యాధునిక టెక్నాలజీతో ఈ SUVను రూపొందించింది. ముఖ్యంగా 328hp పవర్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌, 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్టాండర్డ్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌, 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఈ SUV వేగం, పనితీరు పరంగా స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.

పవర్​ఫుల్ SUVతో వచ్చేస్తున్న Volkswagen.. తక్కువ సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందా?
New Volkswagen T Roc R
Nikhil
|

Updated on: Nov 24, 2026 | 8:20 PM

Share

సాధారణ SUVలతో పోలిస్తే అధిక వేగం, మెరుగైన డ్రైవింగ్ కంట్రోల్ కోరుకునే వారి కోసం Volkswagen ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. లాంచ్ కంట్రోల్ సాయంతో కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. రేసింగ్ ట్రాక్‌లపై డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా ప్రత్యేక డ్రైవింగ్ మోడ్స్‌, సస్పెన్షన్‌, టార్క్ వెక్టరింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. జర్మనీలో ఈ SUV ఆవిష్కరణతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి పెరిగింది.

328hp ఇంజిన్‌..

కొత్త Volkswagen T-Roc Rలో 2.0 లీటర్ EA888 evo5 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 328hp పవర్‌, 420Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని జత చేశారు. Volkswagen R సిరీస్ మోడళ్లలో తొలిసారిగా ఈ 48V టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. ఇంజిన్‌ను 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌, 4MOTION ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అనుసంధానించారు. ఇవి రెండూ స్టాండర్డ్‌గా లభిస్తాయి.

ఈ SUV గరిష్ఠ వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది. 48V సిస్టమ్ తక్కువ ఇంజిన్ వేగం వద్ద ఎలక్ట్రిక్ కంప్రెసర్‌కు శక్తిని అందించడంతో పాటు బ్రేకింగ్ సమయంలో శక్తిని తిరిగి సేకరించే రీజనరేటివ్ ఎనర్జీ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. R-Performance Torque Vectoring టెక్నాలజీ ద్వారా వెనుక రెండు చక్రాలకు అందే టార్క్‌ను విడివిడిగా నియంత్రించవచ్చు. దీనివల్ల మెరుగైన గ్రిప్‌, కంట్రోల్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.

ప్రత్యేక ఫీచర్లు

T-Roc Rలో Adaptive DCC Sports Suspension, Progressive Steering ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. Race, Special, Drift అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ అందించారు. Race Mode స్పోర్టీ డ్రైవింగ్‌కు అనుగుణంగా ఇంజిన్‌, సస్పెన్షన్‌, స్టీరింగ్‌, AWD వ్యవస్థను సెట్ చేస్తుంది. Special Mode ప్రసిద్ధ Nürburgring Nordschleife రేస్ ట్రాక్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. Drift Mode ప్రత్యేకంగా నియంత్రిత రేస్ ట్రాక్‌లపై డ్రిఫ్టింగ్ కోసం ఉపయోగపడుతుంది.

డిజైన్ విషయానికి వస్తే R-స్పెసిఫిక్ ఫ్రంట్ బంపర్‌, రియర్ డిఫ్యూజర్‌, హై-గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌ ఉన్నాయి. నాలుగు పైపులతో కూడిన స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 19 ఇంచుల Zandvoort అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. 20 ఇంచుల Warmenau ఫోర్జ్డ్ వీల్స్‌, Akrapovic టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను అదనపు ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు.

ఇంటీరియర్‌లో బ్లూ R లోగో, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో స్పోర్ట్స్ సీట్లు అందించారు. R-Performance స్టీరింగ్ వీల్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, ప్రత్యేక R బటన్ ఉన్నాయి. Digital Cockpit Pro డిస్‌ప్లేలో GPS ల్యాప్ టైమర్‌, యాక్సిలరోమీటర్‌, AWD టార్క్ డిస్ట్రిబ్యూషన్ వివరాలను చూడవచ్చు. జర్మనీలో ఈ SUV ప్రారంభ ధర 59,995 యూరోలుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.62.51 లక్షలు. అక్కడ ప్రీ-సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే భారత మార్కెట్లో విడుదలపై Volkswagen ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us