Prabhas Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో వదులుకున్న టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అయితే ఈ టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో మాత్రం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని వదులుకున్నాడు.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవింద్రన్ తదితర స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ సైనికుడుగా కనిపిస్తారని సమాచారం. అయితే ఈ ఫౌజీ సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోయానంటున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తోన్న ఈ హీరో ఇప్పుడు పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 16) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తిరువీర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే సమయంలో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా.. వదిలేశానని చెప్పుకొచ్చాడు.
‘హీరోగానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్‌గానూ నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేశాను. మరికొన్ని నచ్చినా.. డేట్స్, లుక్ సెట్ కాక వదులుకోవాల్సి వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’లో మురుగన్ పాత్ర నేనే చేయాల్సింది. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. అలాగే ప్రభాస్ ‘ఫౌజీ’లోనూ ఒక పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నేను వేరే వేరే సినిమాలతో బీజీగా ఉండడం.. ఒక్కో నెలకు ఒక్కో లుక్‌లో ఉండాల్సి రావడంతో అది కూడా వదులుకోవాల్సి వచ్చింది. నా కోసం వాళ్లు షూటింగ్ ఆపుకోవడం నాకు ఇష్టం ఉండదు. వాళ్లకు ప్రయారిటీస్ ఉంటాయి. బడ్జెట్..కండీషన్స్ ..టార్గెట్స్ అన్నీ ఉంటాయి. మన వల్ల అవ్వనప్పుడు మనం ఇబ్బంది పడొద్దు..ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు. అందుకే కొన్ని నచ్చిన పాత్రలను కూడా వదిలేశాను’
‘మన సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు. అందుకే డేట్స్ కుదరట్లేదు అంటే అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం నేను సపోర్టింగ్ యాక్టర్‌గా ఏ సినిమా చేయట్లేదు. హీరోగా నటించిన రెండు, మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది’ అని తీరువీర్ చెప్పుకొచ్చాడు.
పాపం ప్రతాప్ సినిమా ప్రమోషన్లలో తిరువీర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




