చలికాలంలో వచ్చే సాధారణ దగ్గును నిర్లక్ష్యం చేయవద్దు. ఇది న్యూమోనియా కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో చీము లేదా నీరు చేరితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఇది ప్రాణాంతకం కావచ్చు.