Ramayana Movie: ‘రామాయణ’ సినిమాకు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ఈ మధ్యన సినిమాలకు రివ్యూలు, రేటింగ్ లు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని గౌతమ్. తాజాగా అతను రామాయణ సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు తన రేటింగ్ ఎంతో కూడా వెల్లడించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ స్టార్ కిడ్ సినిమాల్లోకి రాక ముందే బాగా హైలెట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యన సినిమాలకు రేటింగ్ లు, రివ్యూలు అంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు గౌతమ్. ఇటీవల నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి షాకింగ్ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచిన గౌతమ్ తాజాగా రామాయణ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. కాగా ఇప్పటివరకు చాలా సినిమాలు చాలా తక్కువ రేటింగ్ ఇచ్చిన గౌతమ్ ‘రామాయణ’ సినిమాకు 4.5 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా తనను ఎంతో ఆశ్చర్యపరిచిందంటూ ప్రశంసలు కురిపించాడు గౌతమ్. ‘రామాయణ’ సినిమా చూశాక నా మనసు పూర్తిగా కరిగిపోయింది, మాటలు రావడం లేదు. ఇందులో సీజీఐ, స్క్రిప్ట్, డైరెక్షన్, నటన అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఎప్పటిలాగే అద్భుతమైన నటన కనబరిచారు. కానీ రావణాసురుడి పాత్రలో యష్ నటన మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన నటన అసాధారణం, అద్భుతం అంతే! ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. భారతీయ సినిమా సత్తా ఏంటో చాటిచెప్పే ఒక నిజమైన నిదర్శనం ఈ రామాయణం చిత్రం’ అని తన రివ్యూలో కొనియాడారు గౌతమ్. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
కాగా నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించాడు. అలాగే సీతాదేవిగా సాయి పల్లవి యాక్ట్ చేసింది. ఇక రావణాసుడి పాత్రలో యష్ అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. వీరితో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. ఫేమస్ మ్యూజిక్ కంపోజర్స్ హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంయుక్తంగా ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




