AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊరిలో మగాళ్ల వింత మరణాలు.. ఓటీటీలో మతిపోగొట్టే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు

థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా గత వారమే ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం ఒరిజినల్ తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు 8 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: ఊరిలో మగాళ్ల వింత మరణాలు.. ఓటీటీలో మతిపోగొట్టే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 7:13 AM

Share

ఈ వారం ఓటీటీలోకి పలు హిట్ సినిమాలు వస్తున్నాయి. దసరాకు థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఈ వీకెండ్ లోనే ఓటీటీలో సందడి చేయనున్నాయి. జైలర్ 2, రణబాలి, దాయిరా, క్రేజీ కల్యాణం, హ్యాపీ జర్నీ, పుష్పక విమానం, కికు చిరంజీవి, పరివారిక్ మనురంజన్, లాంటి మూవీస్, సిరీసులు ఈ వారాంతంలో ఆడియెన్స్ ను అలరించనున్నాయి. అయితే వీటికంటే ముందే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక తమిళ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే కంటెంట్ పరంగానూ ప్రశంసలు అందుకుంది. ఐఎమ్‌డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింట్ గా ఉంటుంది. .. ఈ సినిమా కథ అంతా ‘మెక్కరై’ అనే ఓ మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో ప్రతి ఏడేళ్లకు ఒకసారి, అది కూడా జూన్ నెలలోనే మగవాళ్లు అనుమానాస్పద రీతిలో వరుసగా చనిపోతూ ఉంటారు. ఇది ఊరికి పట్టిన శాపం అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతుంటారు. ఈ వరుస మరణాల మిస్టరీని ఛేదించేందుకు ఊరికి కొత్తగా ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్ వస్తాడు. విచారణలో భాగంగా అతనికి కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. అలాగే ఆ ఊరిలో ఎన్నో తరాలుగా పాతుకుపోయిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. మరి ఊరిలో మగవాళ్ల వరుస మరణాలకు కారణమేంటి? పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆ మిస్టరీని ఎలా కనుక్కున్నాడన్నదే ఈ సినిమా అసలు కథ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న సినిమా పేరు ‘ది డార్క్ హెవెన్’ (The Dark Heaven). ఇదొక తమిళ మిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవవీ. బాలాజీ దర్శకత్వం వహించారు. సిద్ధు సిద్, దర్శిక, రిత్విక, వెలా రామమూర్తి, నిళల్‌గళ్ రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే ఓటీటీలో వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోతో పాటు ఆహా, సింప్లీ సౌత్‌, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో ‘ది డార్క్ హెవెన్’ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు రాగా ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ‘ది డార్క్ హెవెన్’ (The Dark Heaven) సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇప్పుడు తెలుగులోనూ ది డార్క్ హెవెన్..

ది డార్క్ హెవెన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us