OTT Movies: ఈ వారం థియేటర్లలో 10 కొత్త సినిమాలు.. ఓటీటీల్లోనూ సూపర్ హిట్ మూవీస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీక్ లో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలో దాదాపు 10 కు పైగా సినిమాలు వస్తుంటే ఓటీటీలో 20 కు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

దీపావళి కానుకగా రిలీజైన రామాయణ, సీన్ సినిమాలు సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్నాయి. అయితే ఈ వారం కూడా భారీగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇట్లు అర్జున, గోట్(G.O.A.T), భోగి, మాయ లేడీ, డార్క్ చాక్లెట్, దొంగ నా కొడుకు, చంద్రయాన్, జింగో పెన్, అ, టాల్కమ్ పౌడర్.. ఇలా దాదాపు 10 కు పైగా సినిమాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పెద్ద ఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. దసరాకు థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. జైలర్ 2, రణబాలి స్ట్రీమింగ్ డేట్స్ సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ ఖరారు కాగా క్రేజీ కల్యాణం కూడా ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు దాయిరా, వైబ్, పరివారిక్ మనురంజన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. పుష్పక విమానం అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి ఈ వారంలో ఏయే సినిమా ఏయే ఓటీటీలో వస్తుందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్
- ద గుడ్ లాయర్ (ఫ్రెంచ్ సినిమా) – నవంబర్ 09
- ద బాడీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 11
- నెవర్ సరండర్ (ఇండోనేసియన్ సినిమా) – నవంబర్ 12
- మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్ (కొరియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 12
- దాయిరా (హిందీ మూవీ) – నవంబర్ 13
- రణబాలి (తెలుగు సినిమా) – నవంబర్ 13
- హార్ట్ ల్యాండ్ (కెనడియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 13
- కంక్ ఆన్ సినిమా (ఇంగ్లిష్ మాక్యుమెంటరీ) – నవంబర్ 15
అమెజాన్ ప్రైమ్ వీడియో
- జైలర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 12
- వైబ్ (హిందీ చిత్రం) – నవంబర్ 13
జియో హాట్‌స్టార్
- పుష్పకవిమానం (తెలుగు వెబ్ సిరీస్) – నవంబర్ 12
- స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబర్ 13
జీ5
- బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) – నవంబర్ 11
- బాంద్రా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 13
- అఫ్రాతఫ్రీ (మరాఠీ చిత్రం) – నవంబర్ 13
- మిర్గయ 1.5 (బెంగాలీ మూవీ) – నవంబర్ 13
ఆపిల్ టీవీ ప్లస్
- 12 12 12 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 13
- బీయింగ్ హెయిమన్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 13
సోనీ లివ్
- పరివారిక్ మనరంజన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 13
మనోరమ మ్యాక్స్
- ద థర్డ్ మర్డర్ (మలయాళ సినిమా) – నవంబర్ 13
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్
- ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 11
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




