ఆహా ఓటీటీ
ఆహా ఓటీటీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకటి. తెలుగులో మొదటి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఇదే కావడం విశేషం. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ దీని వ్యవస్థాపకులు. గీతా ఆర్ట్స్, మై హోమ్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన ఆహా ఓటీటీని 2020 మార్చి 25న అధికారికంగా లాంఛ్ చేశారు. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఎక్స్‌క్లూజివ్స్, ఒరిజినల్ తదితరాలను స్ట్రీమింగ్ చేస్తారు. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ కంటెంట్ అందుబాటులో ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అత్యంత ప్రేక్షకాధరణ పొందింది. ఇప్పుడు ప్రాసరమవుతున్న ఆహా ఒరిజినల్ – తెలుగు ఇండియన్ ఐడన్ సీజన్ 3కి కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5 వంటి ఓటీటీలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతోంది ఆహా. ఆహా ఓటీటీ కంటెంట్‌ను అన్ని మొబైల్, టాబ్లెట్, వెబ్, స్మార్ట్ టీవీ, స్ట్రీమింగ్ పరికరాలలో వీక్షించవచ్చు.