OTT Movie: ఓటీటీలో ఈ తెలుగు సినిమాను తెగ చూస్తేస్తున్నారు.. ఏకంగా 100 మిలియన్స్ దాటేసిన హారర్ థ్రిల్లర్ మూవీ
ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చి సుమారు 10 రోజులవుతోంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును దాటేసింది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం.

ఓటీటీలో అన్ని రకాల జానర్స్ కు సంబంధించి న కంటెంట్ ఉంటుంది. క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, ఫ్యామిలీ, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ ట్రెండింగ్ అంటే సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలదే అని చెప్పవచ్చు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ జానర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అలా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటి మరిన్ని రికార్డుల వైపు దూసుకుపోతోంది. గతేడాది చివరిలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అసలు అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. స్ట్రీమింగ్ కు వచ్చిన 5 రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును నమోదు చేసిన ఈ మూవీ ఇప్పుడు 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థనే అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆకాశం నుంచి ఊడిపడిన ఒక ఉల్క చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ ఉల్క పడిన తర్వాత గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొంటాయి. మూగ జీవాలు వింతగా ప్రవర్తిస్తాయి. పాలకు బదులు రక్తం ఇస్తాయి. అలాగే ఒక దుష్టశక్తి గ్రామస్తుల శరీరంలోకి ప్రవేశించి అందరినీ చంపుతుంది. ఆ తర్వాత ఈ దుష్టశక్తి శరీరంలో ఉన్నవారు కూడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తోంది. మరి ఆ దుష్టశక్తి ఏంటి? ఉల్కకు దానికి సంబంధమేంటి? ఊరుకొచ్చిన సైంటిస్ట్ దాన్ని ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా. ఇంతకీ ఆ మూవీ ఏదో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.
ఆహా ఓటీటీలో శంభాల రికార్డు..
100 million+ minutes streamed. The fear just got bigger 🔥
Watch #AadiShambhala now only on #aha@iamaadisaikumar @tweets_archana @ugandharmuni pic.twitter.com/ds0ZOXpz9E
— ahavideoin (@ahavideoIN) February 1, 2026
ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు శంభాల. యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ లో ఆది సాయి కుమార్ హీరోగా నటించాడు. అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్దన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కు అవుతోన్న శంభాల సినిమా లేటెస్ట్ గా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటి పోయిందని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
The divine blockbuster 💯
Watch #AadiShambhala now only on #aha@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/yl190HuZY1
— Shining Pictures (@ShiningPictures) February 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




