AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Soniya: మా ఇంటి మహాలక్ష్మి ఇదిగో.. ఎట్టకేలకు కూతురు ఫేస్ రివీల్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో

బిగ్ బాస్ తెలుగు ఫేమ్, ప్రముఖ నటి సోనియా ఆకుల గతేడాది అమ్మగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. ఓ పండంటి ఆడబిడ్డను ప్రసవించిన ఆమె శిఖ వీరగోని అని పేరు పెట్టుకుంది. తాజాగా తన కూతురిని అందరికీ పరిచయం చేసిందీ అందాల తార.

Bigg Boss Soniya: మా ఇంటి మహాలక్ష్మి ఇదిగో.. ఎట్టకేలకు కూతురు ఫేస్ రివీల్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో
Bigg Boss Soniya Akula
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 6:54 AM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో బాగానే ఫేమస్ అయ్యింది. అంతకు ముందు జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్‌, ఆశ ఎన్‌కౌంటర్‌ తదితర సినిమాల్లో నటించింది సోనియా. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిందో ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టే హౌస్ లోనూ తన మాటలతో బుల్లితెర ఆడియెన్స్ ను కట్టి పడేసింది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది సోనియా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసిన సోనియా ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ తోనే బిజీ బిజీగా ఉంటోంది. 2024 డిసెంబర్‌లో యష్‌ వీరగోని అనే వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది సోనియా. తమ పండంటి బంధానికి ప్రతీకగా గతేడాది వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. డిసెంబర్‌ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సోనియా తన కూతురికి శిఖా వీరగోణి అని పేరు పెట్టుకుంది.

ఇక చాలా మంది సెలబ్రిటీల్లాగే సోనియా దంపతులు ఇప్పటివరకు తమ కూతురి ఫేస్ ను చూపించలేదు. తమ పాపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నప్పటికీ అందులో తన కూతురు కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది సోనియా. అయితే తాజాగా సోనియా యష్ తమ కుమార్తె శిఖ ఫేస్ రివీల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు.’ కలర్ ఫెస్టివల్ అయిన హోలీ పండుగ రోజు తమ జీవితాన్ని మరింత రంగులమయం చేసిన తన కుమార్తె శిఖ వీరగోని ‘అంటూ ఈ వీడియోకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు సోనియా దంపతులు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శిఖ అచ్చం సోనియాలాగే ఉంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అలాగే పాప చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

కాగా సోనియా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తన భర్త బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?