AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రసాయనాల సబ్బులకు బైబై.. బియ్యం పిండితో సహజ సబ్బు ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

ప్రతిరోజూ స్నానానికి సబ్బు వాడటం సర్వసాధారణం. మార్కెట్‌లో రకరకాల సబ్బులు అందుబాటులో ఉన్నప్పటికీ, వంటింట్లో ఉండే బియ్యం, బంగాళాదుంప, కలబంద వంటి పదార్థాలతో ఇంట్లోనే సులభంగా సబ్బు తయారు చేసుకోవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు సహజ పదార్థాలతో కూడిన సబ్బును ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఈ సహజ సబ్బు తయారీ, కావాల్సిన పదార్థాలు, ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

రసాయనాల సబ్బులకు బైబై.. బియ్యం పిండితో సహజ సబ్బు ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
Rice Flour Soap
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2026 | 9:24 PM

Share

ప్రతిరోజూ స్నానానికి సబ్బు వాడటం సర్వసాధారణం. మార్కెట్‌లో రకరకాల సబ్బులు అందుబాటులో ఉన్నప్పటికీ, వంటింట్లో ఉండే బియ్యం, బంగాళాదుంప, కలబంద వంటి పదార్థాలతో ఇంట్లోనే సులభంగా సబ్బు తయారు చేసుకోవచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు సహజ పదార్థాలతో కూడిన సబ్బును ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఈ సహజ సబ్బు తయారీ, కావాల్సిన పదార్థాలు, ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతిఒక్కరూ ప్రతిరోజూ సబ్బును వాడతారు. ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల సబ్బులు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి సులభంగా సబ్బును తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మీ బడ్జెట్‌కు భారంగా ఉండదు. పైగా మీ చర్మానికి కూడా మేలు చేసే సహజమైన సబ్బు మీ ఇంట్లోనే లభిస్తుంది. పూనమ్ దేవనాని, తన @Maayehkaisekarun అనే యూట్యూబ్ ఛానెల్‌లో, బియ్యం, బంగాళదుంపలు, కలబంద వంటి వంటగది పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే సబ్బును ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. బియ్యపు పిండితో ఇంట్లోనే సబ్బును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

బియ్యపు పిండి సబ్బును ఎలా తయారు చేయాలి?

కావాల్సిన పదార్థాలు..

ఇవి కూడా చదవండి

4 నుంచి 5 చెంచాల బియ్యం

ఒక బంగాళాదుంప

రెండు చెంచాల కలబంద గుజ్జు

రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్

సబ్బు తయారు చేసే విధానం:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక పరిశుభ్రమైన గుడ్డపై పరిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. బంగాళాదుంప తొక్క తీసి, నీటితో కడిగి, సన్నగా తురుముకోవాలి. ఒక గుడ్డ సహాయంతో దాని రసాన్ని తీయాలి. ఒక గిన్నెలో కలబంద గుజ్జు తీసుకుని, అందులో బంగాళాదుంప రసం, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలపాలి.

తీసుకున్న సబ్బును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేస్తూ సబ్బును కరిగించి, తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. కరిగిన సబ్బు మిశ్రమంలో ముందుగా కలిపి ఉంచిన పేస్ట్‌తో పాటు రెండు పెద్ద చెంచాల బియ్యం పిండిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సబ్బు మౌల్డ్ లేదా పేపర్ కప్పులో పోయాలి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు అలాగే ఉంచి గట్టిపడిన తర్వాత బయటకు తీసి ఉపయోగించుకోవచ్చు. ఇలా తక్కువ వస్తువులతో ఇంట్లోనే సహజ సబ్బును సులభంగా తయారు చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రసాయనాల సబ్బులకు బైబై.. బియ్యం పిండితో సహజ సబ్బు ఇంట్లోనే తయారీ!
రసాయనాల సబ్బులకు బైబై.. బియ్యం పిండితో సహజ సబ్బు ఇంట్లోనే తయారీ!
కార్తీక పౌర్ణమి నాడు ఈ వస్తువులు దానం చేస్తే విశేష పుణ్యఫలం..
కార్తీక పౌర్ణమి నాడు ఈ వస్తువులు దానం చేస్తే విశేష పుణ్యఫలం..
శీతాకాలంలో చర్మాన్ని తేమగా ఉంచే అవిసె–కలబంద ఫేస్ జెల్.. ఇంట్లోనే
శీతాకాలంలో చర్మాన్ని తేమగా ఉంచే అవిసె–కలబంద ఫేస్ జెల్.. ఇంట్లోనే
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ..
ఒకప్పుడు సురేఖమ్మ దగ్గర 5వేలు అప్పు చేశాడు.. ఇప్పుడేమో కోట్లలో..
ఒకప్పుడు సురేఖమ్మ దగ్గర 5వేలు అప్పు చేశాడు.. ఇప్పుడేమో కోట్లలో..
అదరగొట్టిన తిలక్ సేన.. నేపాల్‌పై ఘన విజయం
అదరగొట్టిన తిలక్ సేన.. నేపాల్‌పై ఘన విజయం
రిలీజై 36 సంవత్సరాలు.. ఇప్పటికీ అదే జోరు..
రిలీజై 36 సంవత్సరాలు.. ఇప్పటికీ అదే జోరు..
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సెహ్వాగ్‌ రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సెహ్వాగ్‌ రికార్డ్ బ్రేక్..!
ఏనుగు పిల్లకు అనంత్ అంబానీ సాయం.. అస్సాం సీఎం ప్రశంసలు..
ఏనుగు పిల్లకు అనంత్ అంబానీ సాయం.. అస్సాం సీఎం ప్రశంసలు..
కొబ్బరికాయకు మూడు కళ్లు ఎందుకు ఉంటాయి?లోపలికి నీరు ఎలా చేరుతుంది
కొబ్బరికాయకు మూడు కళ్లు ఎందుకు ఉంటాయి?లోపలికి నీరు ఎలా చేరుతుంది