AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song : ఇది భయ్యా పాటంటే.. వెంకటేశ్, విజయశాంతి కాంబో.. 36 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ అదే జోరు..

టాలీవుడ్ సినీ చరిత్రలో విక్టరీ వెంకటేశ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కాంబినేషన్‌కు ఉన్న క్రేజే వేరు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఓ ఎవర్‌గ్రీన్ మెలోడీ సాంగ్ విడుదలై 36 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అదే జోరుతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అటు యూట్యూబ్, ఇటు సోషల్ మీడియాలో ఈ సాంగ్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా 90 యూత్ ఈ పాటను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు.

Trending Song : ఇది భయ్యా పాటంటే.. వెంకటేశ్, విజయశాంతి కాంబో.. 36 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ అదే జోరు..
Trending Song
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2026 | 8:59 PM

Share

టాలీవుడ్ సినీ చరిత్రలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటాయి. విక్టరీ వెంకటేశ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ శత్రువు. 1990లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన క్లాసిక్ పాటలలో ‘పొద్దున్నే పుట్టింది చందమామ’ ఒకటి . ఏళ్లు గడుస్తున్నా ఈ పాటకు ఉన్న ఆదరణ, సోషల్ మీడియాలో కనిపిస్తున్న సందడి చూస్తుంటే అభిమానులకు పాత జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదలాడుతున్నాయి. తెలుగు సినిమా ప్రేక్షకులకు వెంకటేశ్, విజయశాంతి కాంబినేషన్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. వీరిద్దరి మధ్య కనిపించే సహజమైన అభినయం, ఎనర్జీ పాటలను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ‘పొద్దున్నే పుట్టింది చందమామ’ సాంగ్‌లో ఈ ఇద్దరు స్టార్ల హావభావాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలు ప్రేక్షకులను సులభంగా కట్టిపడేస్తాయి. అందుకే దశాబ్దాలు గడిచినా ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ విన్నా ఈ పాట మారుమోగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

ముఖ్యంగా ఈ పాటలో హైలెట్ మ్యూజిక్. అలాగే ఈ పాటలోని సంగీతం, సాహిత్యం శ్రోతల మనసును తాకేలా ఉంటాయి. “పొద్దున్నే పుట్టింది చందమామ.. మొగ్గలే విచ్చింది ముద్దుగుమ్మ” అంటూ సాగే పల్లవి ఎంతో హాయిగా, మధురంగా వినిపిస్తుంది. చరణాల్లోని చిలిపి భావాలు, ప్రేమలోని ఆప్యాయతను పలికించే పదాలు పాట స్థాయిని మరింత పెంచాయి. ఉదయపు వెన్నెల, ముత్యాల ముగ్గులు వంటి అందమైన వర్ణనలు పాటకు ఒక ప్రత్యేకమైన ఫీల్‌ను తీసుకొచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

ఇంత సుదీర్ఘ కాలం గడిచినా ఈ క్లాసిక్ మెలోడీ ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లలో నిలుస్తూనే ఉంది. యూట్యూబ్, రీల్స్ వంటి వేదికలపై పాత పాటల ట్రెండ్ నడుస్తున్నప్పుడల్లా వెంకటేశ్, విజయశాంతి సూపర్‌హిట్ పాటలకు విశేషమైన స్పందన లభిస్తోంది. ఎవర్‌గ్రీన్ సాంగ్స్ అంటే ఇవేనంటూ నెటిజన్లు ఈ పాటను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

పొద్దున్నే పుట్టింది చందమామ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us