AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu Vaccine: పౌల్ట్రీ వ్యాపారులకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి బర్డ్ ఫ్లూ వ్యాక్సీన్

దేశంలోని పౌల్ట్రీ వ్యాపారులకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా స్వదేశీ H5N1 బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా శుక్రవారం జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాక్సిన్‌ను జాతికి అంకితం చేశారు.

Bird Flu Vaccine: పౌల్ట్రీ వ్యాపారులకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి బర్డ్ ఫ్లూ వ్యాక్సీన్
Indigenous Bird Flu Vaccine India
Anand T
|

Updated on: Nov 20, 2026 | 8:46 PM

Share

స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూకు వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ H5N1 బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను భారత్ తయారు చేసింది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాక్సిన్‌ను జాతికి అంకితం చేశారు. ఇది దేశంలోని పౌల్ట్రీ వ్యాపారులకు భారీ ఊరటను కల్పించనుంది.

జస్ట్ రూ.1కే డోస్

ఈ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ పౌల్ట్రీ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల వ్యాపారులు నష్టపోకుండా చూడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వ్యాపారులకు అందుబాటులో ఉండేలా ఒక్కో డోసును కేవలం రూ.1 నుంచి రూ.2 ధరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

శాస్త్రవేత్తలకు అభినందనలు

స్వదేశీ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు నెలల తరబడి పరిశోధనలు చేశారని.. వారి కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందన్నారు. ఈ మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ వారిని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషిని కొనియాడారు. జంతు వ్యాధుల నియంత్రణలో దేశం సాధిస్తున్న పురోగతిని ప్రస్తావిస్తూ, జాతీయ టీకా కార్యక్రమాల వల్ల గణనీయమైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు.

రూ.300 కోట్లతో పరిశోధనా ప్రయోగశాల

అలాగే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసేలా భోపాల్‌లో రూ.300 కోట్లతో అత్యాధునిక జంతు వ్యాధుల పరిశోధనా ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. జంతువులకు సోకే వ్యాధులపై పరిశోధనలు, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలకు ఈ ప్రయోగశాల ఉపయోగపడనుందన్నారు. అలాగే భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడే వారికి మన అభివృద్ధే తగిన సమాధానమని కేంద్ర మంత్రి అన్నారు. భారత సంస్థలు, శాస్త్రీయ విజయాలను ప్రశ్నించే విమర్శకులు దేశం సాధిస్తున్న పురోగతినే గుర్తించాలని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us