AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetu Royal: గీతూ రాయల్‌తో తిరగడం మానేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ విషయం బయట పెట్టిన క్లోజ్ ఫ్రెండ్

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ ఈ మధ్యన ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పవిత్రమైన తిరుమల శ్రీవారి క్షేత్రంలో తన స్నేహితులతో కలిసి ఈ నటి రీల్స్ చేయడంపై శ్రీవారి భక్తులు భగ్గుమన్నారు. అయితే ఆ తర్వాత వీడియోలను డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Geetu Royal: గీతూ రాయల్‌తో తిరగడం మానేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. షాకింగ్ విషయం బయట పెట్టిన క్లోజ్ ఫ్రెండ్
Geetu Royal
Basha Shek
|

Updated on: Mar 04, 2026 | 8:18 PM

Share

గీతూ రాయల్ గురించి తెలుగు ఆడియెన్స్‌ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా, టిక్ టాక్ స్టార్ గా, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. ఇదే క్రేజ్ తో 2022లో జరిగిన బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే తన ఓవరాక్షన్ తో షో మధ్యలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన గీతూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. తన స్నేహితులతో కలిసి వీడియోలు చేస్తూ మంచి గానే సంపాదిస్తోంది. అయితే ఇటీవల తిరుమల ఆలయంలో గీతూ రాయల్ చేసిన వీడియోలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. . శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ఆమె అక్కడ తన నలుగురు మగ స్నేహితులతో కలిసి అక్కడ రచ్చ చేసింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు రీల్ చేసింది. అలాగే పుష్కరిని, లడ్డు కౌంటర్, ఘాట్ రోడ్ వద్ద రీల్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వీటిని చూసిన భక్తులు, నెటిజన్లు గీతూ గ్యాంగ్ పై మండిపడ్డారు. అయితే తాజాగా గీతూ రాయల్ పై ఆమె క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బీబీ జోడీతో పాటు పలు టీవీ షోల్లోనూ పార్టిసిపేట్ చేస్తోన్న శ్రీ సత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సమయంలో గీతూ రాయల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమధ్య గీతు రాయల్స్‌తో తిరగడం మానేశావా? అని యాంకర్ ప్రశ్నించగా శ్రీ సత్య ఇలా సమాధానమిచ్చింది.. ‘ ఫ్రెండ్స్‌ని మార్చలేదు. కేవలం ఎంజాయ్ మెంట్ ఎక్కువ అవుతుందని అందరికీ దూరంగా ఉంటున్నాను. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని మిగతా వాళ్లను దూరంగా ఉంచుతున్నాను. గీతుకి ఉన్న నెగటివ్ ఎనర్జీ నాకూ వస్తుందేమో అన్న భయంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే.. గీతు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్’ అని ఫుల్ క్లారిటీ గా చెప్పేసింది శ్రీ సత్య.

ఇవి కూడా చదవండి

శ్రీ సత్య లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

ప్రస్తుతం గీతూ పట్ల ఈ బిగ్ బాస్ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్