AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు కాఫీ షాపులో పని చేసింది.. ఇప్పుడు 150 కోట్ల ఆస్తులున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న ఫ్యామిలీ అయినా ఈ స్టార్ హీరోయిన్ తన కెరీర్ ప్రారంభంలో ఒక కాఫీ షాపులో పని చేసింది. తన పాకెట్ మనీని తనే సమకూర్చుకుంది. ఇప్పుడీ హీరోయిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు ఆమె 150 కోట్లకు యజమాని.

Tollywood: ఒకప్పుడు కాఫీ షాపులో పని చేసింది.. ఇప్పుడు 150 కోట్ల ఆస్తులున్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Shraddha Kapoor Birthday
Basha Shek
|

Updated on: Mar 03, 2026 | 3:43 PM

Share

పై ఫొటోలో తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి స్టార్ హీరోయిన్. తండ్రి కూడా ఫేమస్ నటుడు కావడంతో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో తనకంటూ స్టార్ హీరోయిన్ గా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. క్రేజ్ పరంగా అయినా, రెమ్యునరేషన్ల పరంగా అయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోదీ అందాల తార. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలోయింగ్ లో ప్రధాని మోడీ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీలకు మించిన ఈ క్రేజ్ ఈముద్దుగుమ్మ సొంతం. పేరుకు బాలీవుడ్ అయినా ఈ సొగసరి మన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. గతంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇక ఈ హీరోయిన్ నటించిన చివరి సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది. స్టార్ హీరోలు లేకున్నా కేవలం లేడీ ఓరియంటెడ్ స్టోరీతో ఏకంగా రూ.900 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగిపోయింది. ప్రస్తుతం సినిమాలతో పాటు డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ‘స్త్రీ 2’ సినిమా హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. మంగళవారం (మార్చి 03) శ్రద్ధా పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా బాలీవుడ్ స్టైలిష్ విలన్ శక్తి కపూర్ కూతురే శ్రద్ధా కపూర్. కాగా స్టార్ కిడ్ అయినప్పటికీ, ఆమె తన కాళ్ళపై నిలబడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, శ్రద్ధ పాకెట్ మనీ కోసం కాఫీ షాప్‌లో పనిచేసింది. ఈ సమయంలో, ఆమెకు సినిమాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. నటన పట్ల ఆసక్తి ఉన్న ఆమె చదువు మానేసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. శ్రద్ధా కపూర్ తీన్ పట్టి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే, సూపర్‌హిట్ సినిమా ఆషికి 2 తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా మందికి ఫేవరెట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

శ్రద్ధా కపూర్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

శ్రద్ధా కపూర్ ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే ఆమె ఓ ప్రముఖ సినీ రచయిత రాహుల్ మోడీ తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. తరచూ వీరు కలిసున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరు తమ ప్రేమ, డేటింగ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక శ్రద్ధా కపూర్ ఆస్తులు సుమారు రూ. 150 కోట్లకు పైనేనని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by AJIO (@ajiolife)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కోసం 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే
రూ.82 కోట్ల ప్రైజ్ మనీ కోసం 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్