AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamna Jethmalani: ఈ టాలీవుడ్ హీరోయిన్ ఫ్యామిలీని చూశారా? కామ్న జెఠ్మలానికి ఇంత పెద్ద కూతురు ఉందా? ఫొటోస్ వైరల్

గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కామ్న జెఠ్మలానీ. అయితే పెళ్లి, పిల్లల తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత కిరణ్ అబ్బవరం సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. మరి ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ గురించి తెలుసా?

Kamna Jethmalani: ఈ టాలీవుడ్ హీరోయిన్ ఫ్యామిలీని చూశారా? కామ్న జెఠ్మలానికి ఇంత పెద్ద కూతురు ఉందా? ఫొటోస్ వైరల్
Kamna Jethmalani
Basha Shek
|

Updated on: Mar 01, 2026 | 6:45 PM

Share

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది కామ్న జెఠ్మలానీ. 2005లో ప్రేమికులు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. బెండు అప్పారావు ఆర్ ఎంపీ, రణం, సామాన్యుడు సినిమాలతో తెలుగులో ఫేమస్ హీరోయిన్ గా బాగా పాపులర్‌ అయింది. టాస్, కింగ్, సైనికుడు, అందమైన అబద్ధం, రాజాధి రాజా, కత్తి కాంతారావు, యాక్షన్ త్రీడీ, శ్రీ జగద్గురు ఆది శంకర తదితర సినిమాల్లోనూ హీరోయిన్ గానూ, సహాయక నటిగానూ మెప్పించింది. అయితే 2015 చంద్రిక సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించిందీ అందాలతార. పెళ్లి, పిల్లల కారణంగా సుమారు ఏడేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ సొగసరి 2022 వ సంవత్సరం లో ‘గరుడ’ అనే కన్నడ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత 2023లో వ్యవస్థ, 2024లో నెట్ వర్క్ అనే వెబ్ సిరీస్ ల్లోనూ మెరిసింది కామ్న జెఠ్మలానీ. ఇక ఈ ఏడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిందీ అందాల తార. తన స్క్రీన్ ప్రజెన్స్ తో తెలుగు ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

సినిమాల సంగతి పక్కన పెడితే.. కామ్న జెఠ్మలానీ 2014 వ సంవత్సరం లో బెంగళూరు కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సినిమాలు చేయకున్నాసోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కామ్న జెఠ్మలానీ. తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇద్దరు కూతుళ్లతో కామ్న జెఠ్మలానీ..

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. కాగా కామ్న జెఠ్మలానీ కూతుళ్లు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా, క్యూట్ గా కనిపిస్తున్నారు.భవిష్యత్తులో వీళ్లు మరింత పెరిగి పెద్ద అయ్యాక కామ్నా కంటే అందంగా తయారు అయ్యేట్టుగా కనిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?
టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?