Bigg Boss Telugu 9 Grand Finale: తనూజ మాత్రం కాదు.. ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్.. వీడియో ఇదిగో
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 విన్నర్ ఎవరనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. ఆదివారం (డిసెంబర్ 21) జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా తాజాగా బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ తన ఓటు ఎవరికో చెప్పేశాడు.

బిగ్‌బాస్ సీజన్-9 క్లైమాక్స్‌కి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ కు ఆదివారం (డిసెంబర్ 21) తో ఎండ్ కార్డ్ పడనుంది. గతంలో లాగే ఈసారి కూడా చాలా మంది ప్రముఖులు, కామనర్లు కంటెస్టెంట్లు గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరకు ఐదుగురు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ రేసులో నిలిచారు. తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ ఈసారి టాప్-5 కంటెస్టెంట్లుగా ఉన్నారు. పేరుకు ఐదుగురు ఉన్నా టైటిల్ రేసు తనూజ, కల్యాణ్ ల మధ్యనే ఉందని ఈజీగా అర్థమవుతోంది. వీరి మధ్య టప్ ఫైట్ జరుగుతోంది. పీఆర్ హ్యాండిల్స్, ఫ్యాన్స్, ఫాలోవర్లు.. తమ కంటెస్టెంట్‌ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కల్యాణ్ ఓటింగ్ లో టాప్ లో దూసుకెళుతున్నాడు. తనూజ సెకెండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. అలాగే ఇమ్మాన్యుయేల్ మూడు, డిమాన్ పవన్ నాలుగు, సంజనా ఐదో ప్లేసులో ఉన్నారు.
మరోవైపు పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు తమకి నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే డిమాన్ పవన్ కు సపోర్టుగా రీతూ చౌదరి, శ్రీనివాస సాయి, రాము రాథోడ్ కలిసి ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ బిగ్ బాస్ ఫైనల్ లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వీడియోలో నిఖిల్ తో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, నిఖిల్ నాయర్ కూడా ఉన్నారు. ‘విన్నర్ ఎవరనుకుంటున్నావ్.. అని నిఖిల్‌ని టేస్టీ తేజ అడిగాడు. దీనికి ‘ఇమ్మానుయేల్ లేకపోతే కళ్యాణ్’.. అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ వీడియోపై భిన్న రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తనూజ అభిమానులు నిఖిల్ పై మండిపడుతున్నారు. మరి నిఖిల్ చెప్పినట్లు కల్యాణ్ లేదా ఇమ్మాన్యుయేల్ లో ఎవరు బిగ్ బాస్ టైటిల్ గా నిలుస్తారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
టేస్టీతేజ, నిఖిల్ నాయర్ లతో బిగ్ బాస్-8 విన్నర్ నిఖిల్.. వీడియో ఇదిగో..
S8 winner #Nikhil wishing #KalyanPadala winning the Trophy 🏆 VOTE FOR KALYAN PADALA#BiggBossTelugu9#KalyanPadala𓃵 👉#VoteForKalyan👈 pic.twitter.com/tqeSjIUFbL
— 𝕄𝕦𝕣𝕒𝕝𝕚_𝔹igg𝔹oss_𝔽𝕒𝕟 (@MURALI6655) December 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







