AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే పేదలకు ఇళ్లను కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే వీటిని అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. శాసనమండలిలో ఈ ప్రకటన చేశారు.

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..
Double Bed Room
Venkatrao Lella
|

Updated on: Mar 19, 2026 | 8:47 AM

Share

తెలంగాణ ప్రజలకు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూపర్ న్యూస్ అందించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో చాలామంది ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి ఎప్పుడెప్పుడు కేటాయిస్తారా? అంటూ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్మాణాలు మొదలుపెట్టింది. కానీ కొన్ని నిర్మాణాలు పూర్తైనా లబ్దిదారులకు అందించలేదు. మరికొన్ని మధ్యలోనే నిర్మాణం ఆగిపోయి అసంపూర్తి దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంతో పాటు త్వరలో వీటిని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవి పూర్తి అయ్యాక ప్రభుత్వం పేదలకు కేటాయించనుంది.

18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లు

త్వరలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పూర్తి చేసి పేదలకు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీటిని పట్టణాల్లోని పేదలకు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లోని పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు చుట్టూ రోజూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణాల్లోని పేదలకు వారు ఉండే సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అర్హులకు ఇళ్లు రాకపోతే తమ వివరాలు అందించాలని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై అడిగిన ప్రశ్నపై పొంగులేటి స్పందించారు. త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసి పేదలకు కేటాయిస్తామని పేర్కొన్నారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై ప్రకటన

అటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో రెండో విడత ఇళ్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇళ్ల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సమస్యలు ఎదురైతే వచ్చే ఏడాది పథకంలో నిధులు కేటాయిస్తామన్నారు. తొలి విడతలో జారీ అయిన ఇళ్లల్లో జులై నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగంతం చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?