AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: లీటర్‌ పెట్రోల్‌ రూ.167.. లాభాలు తెలిస్తే ఇదే కొట్టిస్తారు..!

Petrol Price: హై-కంప్రెషన్ ఇంజిన్లు కలిగిన వాహనాలకు ఇది తక్షణ పికప్, గరిష్ట పవర్‌ను అందిస్తుంది. ఇంజిన్ ఆయుష్షు పెరుగుదల ఉంటుంది. నాకింగ్ అసలు ఉండదు కాబట్టి ఇంజిన్ లోపలి భాగాలు (పిస్టన్లు, వాల్వ్‌లు) పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. కార్బన్ డిపాజిట్ల నివారణ విషయంలో..

Petrol Price: లీటర్‌ పెట్రోల్‌ రూ.167.. లాభాలు తెలిస్తే ఇదే కొట్టిస్తారు..!
Fuel Price
Subhash Goud
|

Updated on: Jul 28, 2026 | 9:17 AM

Share

Petrol Price: మన బంకుల్లో కొట్టించే పెట్రోల ధర సాధారణ లీటరుకు రూ.105 నుంచి రూ. 115 మధ్య ఉంటే, ఇండియన్ ఆయిల్ (IOCL) ప్రవేశపెట్టిన 100-ఆక్టేన్ (XP100) పెట్రోల్ ధర మాత్రం లీటరుకు రూ. 160 నుంచి రూ. 170 పైనే ఉంటుంది. హైదరాబాద్‌లో ఈ పెట్రోల్‌ ధర రూ.167 ఉంది. మరి ఈ పెట్రోల్‌కు ఇంత ధర ఎందుకు ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి? ఇతర సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం..

ఈ XP100 పెట్రోల్ ప్రత్యేకత? అంత ధర ఎందుకు?

భారతీయ రోడ్లపై సాధారణంగా మనం వాడే పెట్రోల్ ’91-ఆక్టేన్’ కేటగిరీకి చెందుతుంది. అయితే వాహనాల ఆక్టేన్ రేటింగ్స్ మార్కెట్లో పెద్దగా తెలియవు. అయితే హై ఎండ్ కార్లకు ఇది చాలా ముఖ్యం. యార్డ్ స్టిక్ నాక్ రిజిస్ట్రేషన్ల నుండి ఆక్టేన్ రేటింగ్ అర్థం చేసుకోవచ్చు. సూపర్ కార్లు, ప్రీమియం బైకులు, హై-పెర్ఫార్మెన్స్ వాహనాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ‘XP100’ పేరుతో 100-ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ పెట్రోల్ కంటే దీని ధర దాదాపు 50% నుండి 60% వరకు ఎక్కువ.

ఇంతకీ ఆక్టేన్ (Octane Rating) అంటే ఏమిటి?

ఆక్టేన్ రేటింగ్ అనేది ఇంధనం ఇంజిన్ లోపల ఎంత ఒత్తిడిని తట్టుకోగలదో తెలిపే ప్రమాణం. ఇంజిన్‌లో పిస్టన్ కదిలేటప్పుడు ఇంధనం సరైన సమయంలో మండితే వాహనానికి పూర్తి పవర్‌ లభిస్తుంది. ఒకవేళ స్పార్క్ ప్లగ్ వెలగక ముందే ఇంధనం తీవ్రమైన వేడి, ఒత్తిడి వల్ల దానంతట అదే మండిపోతే ఇంజిన్ నుంచి శబ్దం వచ్చి, ఇంజిన్ దెబ్బతింటుంది. ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉన్న పెట్రోల్ ఇంజిన్ నాకింగ్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

XP100 పెట్రోల్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది?

సంక్లిష్టమైన శుద్ధి ప్రక్రియ: సాధారణ పెట్రోల్‌ను శుద్ధి చేయడం కంటే 100-ఆక్టేన్ పెట్రోల్‌ను తయారీ చేయడం చాలా ఖరీదైన ప్రక్రియ. ఇండియన్ ఆయిల్ తన మధుర రిఫైనరీలో స్వదేశీ OCTAMAX టెక్నాలజీని ఉపయోగించి ఈ హై-ఆక్టేన్ ఇంధనాన్ని తయారు చేస్తుంది. దీని ప్రాసెసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. అందుకే దీని ధర ఎక్కువగానే ఉంటుంది. ఇది ఇథనాల్ రహితం. ప్రస్తుతం సాధారణ పెట్రోల్, XP95 లలో ప్రభుత్వం 20% వరకు ఇథనాల్ (E20) కలుపుతోంది. కానీ XP100 ఇంధనం దాదాపు 100% ప్యూర్ పెట్రోల్ (ఇథనాల్ లేనిది). స్వచ్ఛమైన పెట్రోల్ తయారీ, సేకరణ వ్యయం పెరగడం వల్ల దీని ధర కూడా పెరుగుతుంది.

పరిమిత ఉత్పత్తి, రవాణా:

ఈ ఇంధనాన్ని అందరూ వాడరు. సూపర్ కార్లు (లంబోర్గిని, ఫెరారీ, పోర్షే), స్పోర్ట్స్ బైక్‌లు (కవాసాకి, బిఎమ్‌డబ్ల్యూ, డుకాటి) ఉన్న వినియోగదారులు మాత్రమే దీనిని కొనుగోలు చేస్తారు. తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం, ప్రత్యేక ట్యాంకర్లలో కొన్ని ఎంపిక చేసిన బంకులకు మాత్రమే సరఫరా చేయడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి.

ఇంతకీ XP100 స్పెషాలిటీ ఏంటి?

గరిష్ట రేసింగ్ పెర్ఫార్మెన్స్: హై-కంప్రెషన్ ఇంజిన్లు కలిగిన వాహనాలకు ఇది తక్షణ పికప్, గరిష్ట పవర్‌ను అందిస్తుంది. ఇంజిన్ ఆయుష్షు పెరుగుదల ఉంటుంది. నాకింగ్ అసలు ఉండదు కాబట్టి ఇంజిన్ లోపలి భాగాలు (పిస్టన్లు, వాల్వ్‌లు) పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. కార్బన్ డిపాజిట్ల నివారణ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజిన్‌, ఫ్యూయల్ ఇంజెక్టర్లలో మురికి లేదా కార్బన్ పేరుకుపోకుండా క్లీన్‌గా ఉంచుతుంది. అలాగే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్ భాగాలు, రబ్బరు పైపులు తుప్పు పట్టే ప్రమాదం ఉంది. XP100 ప్యూర్ పెట్రోల్ కావడం వల్ల పాత వింటేజ్ కార్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అధిక ఆక్టేన్ రేటింగ్ కారణంగా ఇంజిన్‌లో నాకింగ్ (శబ్దం) తగ్గి, ఇంజిన్ పనితీరు మెరుగవుతుంది. వాహనం సులభంగా, వేగంగా పుంజుకోవడానికి, అలాగే సాఫీగా నడవడానికి సహాయపడుతుంది.

సాధారణ కార్లు, బైకులకు ఇది అవసరమా?

మీ దగ్గర సాధారణ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా రోజువారీ కమ్యూటర్ బైక్ ఉంటే XP100 వాడాల్సిన అవసరం లేదు. సాధారణ బైకులు, కార్లలో కొట్టినా ఇంజిన్‌కు ఎలాంటి హాని జరగదు. కాకపోతే మీరు చెల్లించే అధిక ధరకు తగ్గ అదనపు ప్రయోజనం సాధారణ ఇంజిన్లలో కనిపించదు. ఇది పూర్తిగా హై-ఎండ్ స్పోర్ట్స్, లగ్జరీ వాహనాల కోసమే డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: RBI: ఇక మార్కెట్లో కొత్త నోట్లు.. చిరగవు, తడవవు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇది కూడా చదవండి: Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us