AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!

Business Ideas: కార్పొరేట్ ఉద్యోగం మాత్రమే జీవితం కాదని, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే సంప్రదాయ వ్యాపారాలలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా సొంతంగా అడుగులు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనే దానికి ఇతని కథనం ఒక చక్కటి ఉదాహరణ..

Success Story: TCS ఉద్యోగాన్ని కాదని.. రూ. 35 ల బియ్యం వ్యాపారంతో ఏటా రూ. 25 లక్షల సంపాదన!
Business Ideas
Subhash Goud
|

Updated on: Jul 28, 2026 | 7:38 AM

Share

Business Ideas: ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ చదువులు పూర్తి చేసిన తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. సాధారణంగా ప్రముఖ ఐటీ సంస్థ (TCS) నుంచి ఆఫర్ లెటర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ఆనందంగా ఓకే చెప్పి అంతకంటే మంచి ఉద్యోగం ఏముంటుందిలే అని వెంటనే కార్పొరేట్ ఉద్యోగంలో చేరిపోతారు. కానీ ఒక యువకుడు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడు. చేతికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని, సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో బియ్యం వ్యాపారంలోకి దిగాడు.

కేవలం రూ. 35 కే కిలో బియ్యం అమ్మడం ద్వారా ప్రారంభమైన అతని ప్రయాణం.. నేడు ఏటా రూ. 25 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది. అంతపెద్ద ఉద్యోగం వదిలి పెట్టి ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించేలా ఎదిగాడు. X అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్ ప్రకారం, ఈ యువకుడు కార్పొరేట్ ఉద్యోగం కంటే తన బియ్యం వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: Jio freedom offer: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌.. ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు ఉచితం

కార్పొరేట్ వద్దనుకుని.. సొంత బాటలో..

చదువు పూర్తయ్యాక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి బహుళజాతి కంపెనీలో ఉద్యోగం రావడం అంటే చాలామందికి అదొక కల. అయితే, ఇతనికి మాత్రం ఉద్యోగం చేయడం కంటే వ్యాపారవేత్తగా మారాలనే కోరికే బలంగా ఉంది. అందుకే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఉద్యోగ ప్రతిపాదనను నిరాకరించాడు (No చెప్పాడు). కుటుంబం లేదా సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను పక్కనపెట్టి, నిత్య జీవితంలో అందరికీ అవసరమయ్యే బియ్యం (Rice) వ్యాపారాన్ని ఎంచుకున్నాడు.

రూ.35 కిలో బియ్యంతో ప్రారంభం

ఏ వ్యాపారమైనా మొదట్లో సవాళ్లతోనే ప్రారంభమవుతుంది. ప్రారంభంలో నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటు ధరలో అందించాలని నిర్ణయించుకున్నాడు. అలా కిలో రూ. 35 చొప్పున బియ్యం విక్రయించడం ప్రారంభించాడు. బియ్యం నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, నేరుగా రైతులతో లేదా నమ్మకమైన మిల్లుల నుంచి సేకరించి కస్టమర్లకు అందించేవాడు. నాణ్యమైన బియ్యం తక్కువ ధరలో దొరకడంతో కొద్దిరోజుల్లోనే కస్టమర్లలో నమ్మకం ఏర్పడింది. ఒకరి ద్వారా మరొకరికి ప్రచారం జరిగి వ్యాపారం పుంజుకుంది.

ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం

ప్రారంభంలో చిన్నగా మొదలైన ఈ బియ్యం వ్యాపారం, అతని వ్యూహాలు, శ్రమ, నాణ్యతతో వేగంగా విస్తరించింది. ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా ఏడాదికి రూ. 25 లక్షలకు పైగా ఆదాయాన్ని (టర్నోవర్) ఆర్జిస్తూ విజయం సాధించాడు.

నేటి యువతకు స్ఫూర్తి

కార్పొరేట్ ఉద్యోగం మాత్రమే జీవితం కాదని, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే సంప్రదాయ వ్యాపారాలలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా సొంతంగా అడుగులు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనే దానికి ఇతని కథనం ఒక చక్కటి ఉదాహరణ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us