బాధితులకు అండగా నిలుద్దాం.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం ‘పింక్ పవర్ రన్ 3.0’.. లైవ్ వీడియో
బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో MEIL ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ సీజన్ 3.0’ నిర్వహించారు. HMDA గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో సుధా రెడ్డి ఫౌండేషన్, మెయిల్ (MEIL) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ సీజన్ 3.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగిన ఈ రన్‌ను కృష్ణారెడ్డి, సుధారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, క్యాన్సర్ ముందస్తు గుర్తింపు ప్రాధాన్యతను చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో 10కే (10K) రన్‌ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. బాధితులకు అండగా నిలవాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
