AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి 320 కోట్ల మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

మలయాళం స్టార్ హీరో నివిన్ పౌలీ, ట్రెండిగ్ బ్యూటీ, ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

OTT Movie: ఓటీటీలోకి 320 కోట్ల మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 27, 2026 | 6:55 AM

Share

ఇటీవల చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’. ‘ప్రేమలు’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కంచిన దర్శకుడు గిరీష్ ఏడీ ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని కూడా తెరకెక్కించాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోన్న మలయాళం స్టార్ హీరో నివిన్ పౌలీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే ప్రేమలు ఫేమ్, ట్రెండింగ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా చేసింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 320 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగులోనూ రిలీజైన ఈ మూవీ ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాతే సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ముందుగానే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 02న ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రావొచ్చునని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా విషయానికి వస్తే.. నివిన్ పౌలీ, మమితా బైజుతో పాటు సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తదితరులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విష్ణు విజయ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

‘బెత్లెహొమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us