ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. ఇక అలా కుదరదు!

September 26, 2026

Subhash

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వంటి ఆన్‌లైన్ సేల్స్ ఇప్పుడు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. 

ఆన్‌లైన్ సేల్స్

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ తెస్తోంది. ఇవి 2027 జనవరి 1వ తేదీ నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి అన్ని ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లకు వర్తిస్తాయి.

కొత్త రూల్

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు డిస్కౌంట్లను ప్రకటించినప్పుడు, గత 30 రోజులలో ఆ ప్రోడక్ట్‌ను అత్యల్ప ధరను తప్పనిసరిగా చూపించాలి. దీనివల్ల నకిలీ డిస్కౌంట్లను నివారించవచ్చు.

ఫేక్ డిస్కౌంట్లు

సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే స్పాన్సర్డ్ ప్రొడక్ట్‌లను స్పష్టంగా లేబుల్ చేయాలి. వినియోగదారులు ఏవి స్పాన్సర్డ్ ఉత్పత్తులో సులభంగా గుర్తించగలగాలి.

స్పాన్సర్డ్ ప్రొడక్ట్‌లు

వినియోగదారుడికి తెలియకుండా కార్ట్‌లో ఇన్సూరెన్స్ వంటి అదనపు వస్తువులను చేర్చడం, లేదా క్యాన్సిల్ ఆప్షన్‌ను దాచిపెట్టడం వంటివి ఇకపై అనుమతి ఉండదు.

చెక్‌అవుట్ ట్రిక్స్‌కు చెక్

ప్లాట్‌ఫామ్‌లు మీ షాపింగ్ డేటాను ఉపయోగించి సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా మీ ముందస్తు అనుమతి తీసుకోవాలి.

డేటా ప్రైవసీ

దిగుమతి ఉత్పత్తులు, వాటి వివరాలను, తయారీ దేశాన్ని స్పష్టంగా ప్రదర్శించాలి. మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లు మినహా, ప్లాట్‌ఫామ్‌లు మీ బిల్లుకు సంబంధం లేని సర్వీస్ ఫీజులను జోడించకూడదు.

దాగి ఉన్న వివరాలు